Begin typing your search above and press return to search.

సూర్య టైటిల్ తో బిచ్చగాడి సినిమా!

By:  Tupaki Desk   |   2 Jan 2017 8:24 AM GMT
సూర్య టైటిల్ తో బిచ్చగాడి సినిమా!
X
ఈమధ్య కాలంలో విడుదలయిన చిన్న సినిమాల్లో అల్లకల్లోలం సృష్టించిన వాటిలో "బిచ్చగాడు" ప్రత్యేకమైందనే చెప్పాలి. విజయ్ ఆంటోనీ అనే వ్యక్తిని హీరోగా నిలబెట్టిన సినిమా! అయితే తమిళంలో మాత్రం "నాన్" తెలుగులో "నకిలీ" సినిమాతోనే సూపర్ హిట్ రావడంతో అక్కడ ఎస్టాబ్లిష్ అయినా, తెలుగులో మాత్రం బిచ్చగాడు సినిమా విజయ్ ఆంటోనీకి డైరెక్ట్ మార్కెట్ ఓపెన్ చేసింది. ఇదే క్రమంలో తాజాగా మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విజయ్ ఆంటోనీ.

నకిలీ, డాక్టర్ సలీం సినిమాలను థియేటర్ లో కంటే టీవీలో చూసినప్పుడే గుర్తించిన వారి ఎక్కువనే చెప్పుకోవాలి. కానీ బిచ్చగాడి తర్వాత విజయ్ ఆంటోనీ వేరు. అనంతరం విడుదలైన "బేతాళుడు" డివైడ్ టాక్ తెచ్చుకున్నా కూడా వసూళ్ల విషయంలో ఏమాత్రం తగ్గకుండా నిలబడిపోయింది. దీంతో బేతాళుడు అనంతరం తాజాగా "యమన్" తెలుగులో "యముడు" సినిమాతో రాబోతున్నాడు విజయ్ ఆంటోనీ. అయితే ఇప్పటికే ఈ పేరున సూర్య సినిమా ఉండటంతో... ఆ టైటిల్ కు ముందో వెనకో ఏదోకటి తగిలించుకుని వచ్చే అవకాశం ఉంది.

తమిళంలో విజయ్ ఆంటోనీ సూపర్ హిట్ సినిమా "నాన్" డైరెక్టర్ జీవా శంకర్ దర్శకత్వంలోనే ఈ "యమన్" సినిమా రానుండటంతో తమిళంలో ఆ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో పాటు రజినీకాంత్‌తో '2.0' లాంటి ప్రెస్టీజియస్ మూవీని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ ఈ "యమన్" సినిమాను నిర్మిస్తుండటంతో మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి. అన్నీ అనుకూలంగా జరిగితే ఈ సినిమా జనవరిలో సంక్రాంతి హడావిడి తగ్గిన అనంతరం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/