Begin typing your search above and press return to search.

పారితోషికం తగ్గించుకున్న మొదటి హీరో

By:  Tupaki Desk   |   6 May 2020 7:15 AM GMT
పారితోషికం తగ్గించుకున్న మొదటి హీరో
X
కరోనా కారణంగా అన్ని ఇండస్ట్రీల మాదిరిగానే సినిమా పరిశ్రమ కూడా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురవుతుంది. గత రెండు నెలల కాలంగా షూటింగ్స్‌ పూర్తిగా ఆగిపోయాయి. ఇక సినిమాల విడుదల విషయంలో ఎప్పటికి క్లారిటీ వచ్చేనో తెలియడం లేదు. ఇదే సమయంలో నిర్మాతలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మేకింగ్‌ లో ఉన్న సినిమాలు ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆగిపోయే ప్రమాదం ఉందని అలాగే కొత్త సినిమాల నిర్మాణంకు నిర్మాతలు ఇప్పట్లో ముందుకు వచ్చే పరిస్థితి లేదంటున్నారు.

ఇలాంటి సమయంలో నటీనటులు మరియు టెక్నీషియన్స్‌ తమ పారితోషికాలను తగ్గించుకుని నిర్మాతలకు కొంతలో కొంత అయినా భారం తగ్గించాలని.. అప్పుడే నిర్మాతలకు భవిష్యత్తు ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. హీరోలు కనుక పారితోషికాల విషయంలో రాజీ పడకుంటే కష్టం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న సమయంలో తమిళ హీరో విజయ్‌ ఆంటోనీ తన పారితోషికంను 25 శాతం తగ్గించుకుంటున్నట్లుగా ప్రకటించాడు.

పారితోషికం విషయంలో స్పందించిన మొదటి హీరోగా విజయ్‌ ఆంటోనీ నిలిచాడు. ప్రస్తుతం ఈయన చేస్తున్న మూడు సినిమాలకు కూడా ఈ నిర్ణయంను అమలు చేయబోతున్నట్లుగా పేర్కొన్నాడు. ఈయన మాదిరిగానే ఇతర హీరోలు కూడా పారితోషికం విషయంలో తగ్గడంతో పాటు మేకింగ్‌ విషయమే ఇంకా పలు రకాలుగా కూడా నిర్మాతలకు సాయంగా ఉండాలి. అప్పుడే మళ్లీ నిర్మాతలు సినిమాల మేకింగ్‌ కు ముందుకు వస్తారు. కనీసం రెండేళ్ల వరకు అయినా హీరోలు పారితోషికాల విషయంలో రాజీ పడాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.