Begin typing your search above and press return to search.

బిచ్చ‌గాడు సైతాన్ అయ్యాడు

By:  Tupaki Desk   |   18 Jun 2016 3:57 PM GMT
బిచ్చ‌గాడు సైతాన్ అయ్యాడు
X
మొన్న‌టిదాకా విజ‌య్ ఆంటోనీ అంటే తెలుగోళ్ల‌కు ఎవ‌రో పెద్ద‌గా తెలిసేది కాదు. కానీ ఈ నెల రోజుల్లో అత‌ను మ‌న ఆడియ‌న్స్ కు బాగా ద‌గ్గ‌రైపోయాడు. అత‌ను హీరోగా న‌టించిన ‘బిచ్చ‌గాడు’ తెలుగులో ఎవ్వ‌రూ ఊహించ‌ని స్థాయిలో సెన్సేష‌న‌ల్ హిట్ట‌యిపోయింది. విడుద‌లై ఐదు వారాల‌వుతున్నా ఆ సినిమాకు ఇప్ప‌టికీ మంచి క‌లెక్ష‌న్లు వ‌స్తున్నాయి. ఈ సినిమాతొ విజ‌య్ ఆంటోనీకి తెలుగులో మంచి మార్కెట్ కూడా వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక అత‌ను న‌టించే ప్ర‌తి సినిమా తెలుగులోకి అనువాదం కావ‌డం గ్యారెంటీ. ముఖ్యంగా ఆంటోనీ త‌ర్వాతి సినిమా మీదికి ఇప్పుడంద‌రి దృష్టి మ‌ళ్లింది.

సైతాన్‌.. ఇదీ విజ‌య్ ఆంటోనీ త‌ర్వాతి సినిమా పేరు. ఈ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ట‌ర్న్డ్ హీరో మ‌రోసారి వైవిధ్య‌మైన ప్ర‌య‌త్న‌మే చేస్తున్న‌ట్లున్నాడు. దీని పోస్ట‌ర్లు అంత స్ట‌న్నింగా ఉన్నాయి. ఇంత‌కుముందు పాముల మ‌ధ్య విజ‌య్ ఆంటోనీ అరుస్తున్న ఫియ‌ర్ ఫుల్ పోస్ట‌ర్ సెన్సేష‌న్ అయింది. తాజాగా మ‌రో ఇంటెన్స్ పోస్ట‌ర్ ఒక‌టి వ‌దిలారు. హీరోగా మారిన‌ప్ప‌టి నుంచి సొంత బేన‌ర్లోనే సినిమాలు చేస్తున్నాడు ఆంటోనీ. ఈ చిత్రం కూడా అత‌డి బేన‌ర్లోనే తెర‌కెక్కుతోంది. ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి అనే యంగ్ డైరెక్ట‌ర్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో విజ‌య్ ఆంటోనీ స‌ర‌స‌న అరుంధ‌తి నాయ‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. .జులైలో విడుద‌ల కాబోతున్న ‘సైతాన్‌’ను అదే పేరుతో తెలుగులో రిలీజ్ చేసే అవ‌కాశాలున్నాయి.