Begin typing your search above and press return to search.

మలేషియా షూట్ లో బిచ్చగాడు హీరోకు తీవ్ర గాయాలు.. ఇప్పుడెలా ఉందంటే?

By:  Tupaki Desk   |   17 Jan 2023 12:04 PM IST
మలేషియా షూట్ లో బిచ్చగాడు హీరోకు తీవ్ర గాయాలు.. ఇప్పుడెలా ఉందంటే?
X
ఇప్పుడంటే పాన్ ఇండియా అన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అలాంటిదేమీ లేనప్పుడు.. కొన్ని చిత్రాలు కంటెంట్ తో వివిధ భాషల్లోకి అనువాదమై సూపర్ సక్సెస్ సాధించిన వైనం తెలిసిందే. ఆ కోవలోకే వస్తుంది బిచ్చగాడి మూవీ.

ఈ చిత్రం ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రంతో హీరోగా తెలుగుప్రజలకుపరిచయమైన విజయ్ ఆంటోనీ తాజాగా ఒక షూటింగ్ లో తీవ్ర గాయాల పాలయ్యారు.ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొంది.

నటుడిగానే కాదు దర్శకుడిగా కూడా టాలెంట్ ఉన్న విజయ్ ఆంటోనీ పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయనకు 2023 చాలా కీలకమైన ఏడాదిగా చెబుతున్నారు. ఆయన నటిస్తున్న చిత్రాలు ఇప్పుడు ఆరు వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది.

అవన్నీ ఈ ఏడాది తెర మీదకు వస్తాయని చెబుతున్నారు. గతంలో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ తాజాగా రూపొందిస్తున్నారు. ఈ మూవీకి ఆయన దర్శకత్వాన్నివహిస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర షూట్ లో భాగంగా వాటర్ బోట్ లో వెళుతుండగా.. ప్రమాదవశాత్తు బోట్ అదుపు తప్పి.. మరో బోట్ ను ఢీ కొనటంతో విజయ్ ఆంటోని తీవ్రంగా గాయాలపాలు అయినట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఆయన్ను వెంటనే కౌలాలంపూర్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన విజయ్ ఆంటోనీ ప్రస్తుతం కోలుకుంటున్నట్లుగా చెబుతున్నారు. తన భర్తకు తీవ్ర గాయాలైన విషయం తెలిసినంతనే విజయ్ ఆంటోనీ సతీమణి హుటాహుటిన మలేషియాకు పయనమయ్యారు. ఈ ప్రమాదంపై చిత్రపరిశ్రమలో షాకింగ్ గా మారింది. విజయ్ ఆంటోనీత్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.