Begin typing your search above and press return to search.

విజయ్ ఆంటోనీ తాగి షూటింగుకి వచ్చాడు

By:  Tupaki Desk   |   21 Aug 2016 9:22 AM GMT
విజయ్ ఆంటోనీ తాగి షూటింగుకి వచ్చాడు
X
మందు కొట్టి ఎవరైనా షూటింగ్ లో పాల్గొంటారా.. అలా చేస్తే డైరెక్టర్ ఒప్పుకుంటాడా.. ఐతే మ్యూజిక్ డైరెక్టర్ కమ్ యాక్టర్ విజయ్ ఆంటోనీ మాత్రం తాగే షూటింగుకి వచ్చాడట. అలాగే షూటింగులో పాల్గొన్నాడట. మరి మందు కొట్టి ఎలా నటించగలిగాడు.. విజయ్ ఇలా చేస్తుంటే ఆ డైరెక్టర్ ఎలా ఒప్పుకున్నాడు.. ఈ విషయం అసలు ఎలా బయటికి వచ్చింది.. అని సందేహాలు కలుగుతున్నాయి కదా. అక్కడే ఉంది మేటర్.

తాను మందు కొట్టి షూటింగులో పాల్గొన్న విషయం విజయ్ ఆంటోనీనే స్వయంగా వెల్లడించాడు. సిచువేషన్ డిమాండ్ చేయడం వల్లే విజయ్ అలా చేశాడట. నటనలో కొనసాగుతూనే కొన్ని సినిమాలకు సంగీతం కూడా అందిస్తున్న విజయ్ ఆంటోనీ.. ఈ మధ్య తాను సంగీతం అందిస్తున్న ‘నంబియార్’ సినిమాలో ఓ పాటలోనూ తళుక్కుమన్నాడు. దర్శకుడి కోరిక మేరకు ఆ పాటలో కనిపించాడు.

ఐతే అది మందుకొట్టి డ్యాన్సు చేసే ఐటెం సాంగ్ అట. ఐతే నిజంగానే మందుకొట్టి పాటలో నటిస్తే సహజంగా ఉంటుందని భావించి విజయ్ ఆంటోనీ.. సెట్ కు వచ్చే ముందు మద్యం తాగాడట. ఐతే ఈ సినిమాలో హీరో అయిన సంతానం మాత్రం అలా ఏమీ చేయకుండానే సహజంగానే మందు కొట్టిన వాడిలాగా చక్కగా నటించాడని అంటున్నాడు విజయ్ ఆంటోనీ.