Begin typing your search above and press return to search.

బిచ్చగాడు టైటిల్ పట్టుబట్టి పెట్టించాడట

By:  Tupaki Desk   |   2 July 2016 10:21 AM GMT
బిచ్చగాడు టైటిల్ పట్టుబట్టి పెట్టించాడట
X
బిచ్చగాడు.. ఇలాంటి టైటిల్ తో ఓ సినిమా వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ ఇదే టైటిల్ తో ఓ సినిమా వచ్చింది. సంచలన విజయం సాధించి.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఐతే ముందు ఈ టైటిల్ చూసి టాలీవుడ్ జనాలు ఎన్ని సెటైర్లు వేశారో ఇండస్ట్రీలో ఉన్నవాళ్లకు బాగానే తెలుసు. ఓ ప్రముఖ క్రిటిక్.. ఈ టైటిల్ గురించి ఎగతాళిగా మాట్లాడిన విషయం ఆయన ఫాలోవర్లకు బాగా తెలుసు. ఐతే టైటిల్ విషయంలో జనాల నుంచి ఇలాంటి రెస్పాన్స్ వస్తుందని తనకు తెలుసని.. అయినప్పటికీ ఇదే టైటిల్ ఉండాలని తాను పట్టుబట్టి మరీ పెట్టించినట్లు వెల్లడించాడు హీరో విజయ్ ఆంటోనీ.

‘‘తమిళంలో పిచ్చైకారన్ అనే పేరు పెట్టినపుడు చాలా అభ్యంతరాలొచ్చాయి. కానీ కథ రీత్యా ఆ పేరైతే బాగుంటుందని నాకు గట్టి నమ్మకం. అందుకే నేను.. దర్శకుడు శశి కలిసి ఆ టైటిలే ఉండాలని ఫిక్సయ్యాం. తెలుగులోనూ ‘బిచ్చగాడు’ అనే పేరే పెట్టమని నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మీద ఒత్తిడి తెచ్చా’’ అని విజయ్ ఆంటోనీ తెలిపాడు. ‘బిచ్చగాడు’ను తెలుగులో రీమేక్ చేయడానికి కొన్ని ఆఫర్లు వచ్చిన మాట వాస్తవమని ఆంటోనీ వెల్లడించాడు. ‘‘కొందరు రీమేక్ హక్కుల కోసం అడిగారు. ఈ దిశగా కొన్ని ప్రయత్నాలు కూడా జరిగాయ. ఐతే నేను తెలుగు ప్రేక్షకులకు చేరువ కావడం కోసం అనువాదం చేస్తేనే బాగుంటుందని అనుకున్నాను. ఈ ఆలోచనతోనే వెంటనే అనువాద కార్యక్రమాలు మొదలుపెట్టేశాం. ఇకపై నా సినిమాలన్నీ తెలుగులో వస్తాయి. తెలుగు-తమిళంలో ద్విభాషా చిత్రాలు తీయాలన్న ఆలోచన కూడా ఉంది’’ అని విజయ్ ఆంటోనీ చెప్పాడు.