Begin typing your search above and press return to search.

విజయ్ ఆంటోనీ.. తెలుగు సినిమా

By:  Tupaki Desk   |   16 Dec 2016 5:30 PM GMT
విజయ్ ఆంటోనీ.. తెలుగు సినిమా
X
‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగులో మాంచి ఫాలోయింగ్ సంపాదించేశాడు విజయ్ ఆంటోనీ. అంతకుముందు నకిలీ.. సలీమ్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించినా.. అతణ్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ‘బిచ్చగాడు’ తర్వాత మాత్రం తెలుగులో అతడి మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. విజయ్ కొత్త సినిమా ‘బేతాళుడు’ను దాదాపు రూ.3 కోట్లు పెట్టి కొన్నారంటే అతడికి ఇక్కడ ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘బేతాళుడు’కు నెగెటివ్ టాక్ వచ్చినా సరే.. ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. శాటిలైట్ కూడా కలుపుకుని బ్రేక్ ఈవెన్ కు వచ్చేసిందా సినిమా. విజయ్ ప్రస్తుతం నటిస్తున్న ‘యెమెన్’ మీద కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.

తెలుగునాట తనకున్న క్రేజ్ చూసుకుని విజయ్ ఆంటోనీ త్వరలో ఓ తెలుగు సినిమా చేయబోతుండటం విశేషం. ఈ చిత్రాన్ని రాధికా శరత్ కుమార్ ‘రాడాన్ పిక్చర్స్’ బేనర్ మీద నిర్మించనుంది. ఐతే ఇది ప్యూర్ తెలుగు సినిమా కాదు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి తెరకెక్కుతుంది. సూర్య ఎప్పుడూ ఇలాగే సినిమాలు చేస్తుంటాడు. విజయ్ ఆంటోనీ-రాధిక కాంబినేషన్లో రాబోయే సినిమాకు ఇంకా దర్శకుడు ఖరారవ్వలేదు. విజయ్ ఆంటోనీని సంగీత దర్శకుడిగా పరిచయం చేసింది రాధికనే కావడం విశేషం. ఇక విజయ్ కొత్త సినిమా ‘యెమెన్’ను ‘2.0’ను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తుండటం విశేషం. ఆ చిత్రం ఫిబ్రవరిలో తమిళ-తెలుగు భాషల్లో ఒకేసారి విడుదలవుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/