Begin typing your search above and press return to search.

చెప్పే నీతులన్నీ సినిమాల వరకే!!

By:  Tupaki Desk   |   15 Nov 2016 4:16 AM GMT
చెప్పే నీతులన్నీ సినిమాల వరకే!!
X
విజయ్ ఆంటోనీ.. ఓ ఆర్నెల్ల క్రితం టాలీవుడ్ జనాలకు అంతగా పరిచయం లేని ఈ పేరు.. ఇప్పుడు చాలామందికే తెలిసిపోయింది. అంతా బిచ్చగాడు మహత్యం అంతే. ఏ మాత్రం నమ్మకాలు లేకుండా.. కేవలం నామమాత్రపు రేట్లకే(50లక్షలు) పిచ్చైకారన్ తెలుగు హక్కులు అమ్మేస్తే.. ఇక్కడ పిచ్చపిచ్చగా వసూళ్లు రాబట్టేసింది. దీనికి తోడు కేరక్టర్ కి తగినట్లుగా స్తబ్థుగా నటిస్తూ.. యాక్టింగ్ విషయంలో మంచి మార్కులు వేయించుకోవడం ఈ హీరోకి కలిసొచ్చింది. ఈ దెబ్బతో టాలీవుడ్ లో కూడా సెటిల్ అయిపోయేందుకు విజయ్ యాంటోనీ మంచి స్కెచ్ లనే వేశాడు.

కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు అనౌన్స్ చేయగానే.. ఇదే థీమ్ పై సినిమా చేస్తున్నట్లు వార్తలొచ్చాయి . బిచ్చగాడు2 మూవీని బ్లాక్ మనీపై చేయనున్నట్లుగా న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది. దీనికి బలం చేకూరుస్తూ బిచ్చగాడు మూవీలో 'ఐదొందలు.. వెయ్యి నోట్ల'పై ఓ బిచ్చగాడు చెప్పే డైలాగ్ సోషల్ మీడియాలో షేరింగ్ అయింది. ప్రస్తుతం దేశం ఎదుర్కుంటున్న సిట్యుయేషన్ ని ఈ హీరో కరెక్ట్ గా వాడేసుకుంటున్నాడని అంతా అనుకున్నారు.

కానీ ఈ బిచ్చగాడు మాత్రం తన లేటెస్ట్ మూవీ 'బేతాళుడు'ని విడుదల చేయడంలో.. ఆ బ్లాక్ మనీపై తీసుకుంటున్న చర్యల దగ్గరే భయపడిపోయాడు. దేశం ఎదుర్కుంటున్న సమస్య అంటూ కరెన్సీని కంట్రోల్ చేయడంతో.. తన సినిమాను వాయిదా వేసేసుకున్నాడు విజయ్ యాంటోనీ. చెప్పే నీతులన్నీ సినిమాల వరకే తప్ప.. కమర్షియల్ యాంగిల్ లో తేడా వస్తే ఎవరైనా ఒకటే అనడానికి 'బేతాళుడు' పోస్టుపోన్మెంట్ పక్కా ఎగ్జాంపుల్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/