Begin typing your search above and press return to search.
ఆమె కోఆపరేట్ చేయటంతోనే రొమాన్స్ పండించాడట!
By: Tupaki Desk | 15 Jun 2019 10:08 AM ISTడబ్బింగ్ చిత్రాలతో పరిచయమైన విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిచ్చగాడు చిత్రం ముందు వరకు అతనికున్న ఇమేజ్ ను.. ఆ చిత్రం ఒక్కసారిగా మార్చేసింది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడిగా మారిన అతగాడు.. తర్వాతి చిత్రాల విషయంలో మెప్పించలేకపోయారు. తాజాగా అర్జున్ తో కలిసి చేసిన చిత్రం కిల్లర్ (మలయాళ మాతృక కొలైగారన్).
ఇటీవల కాలంలో ముఖం చాటేసిన విజయం తాజా చిత్రంతో దరి చేరింది. తెలుగుతో పోలిస్తే.. మలయాళంలో ఈ చిత్రం బాగా సక్సెస్ అయ్యింది. ఇప్పుడాయన ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విజయోత్సవ కార్యక్రమం జరిగింది. సినిమా సక్సెస్ లో అర్జున్ కీలకమని.. ఆయన చిటికెన వేలితో విజయాన్ని అందించినట్లుగా వెల్లడించారు.
తనకు స్క్రీన్ మీద రొమాన్స్ చేయటంలో వెనుకబడి ఉంటానన్న విమర్శ ఉందని.. ఈ చిత్రంలో అది కాస్తా పోయిందన్నారు. దానికి కారణం చిత్ర హీరోయిన్ అషిమా నర్వాల్ గా చెప్పారు. ఆమె కారణంగానే తాను రొమాన్స్ ను పండించగలిగినట్లుగా చెప్పారు. ఆమె కోఆపరేట్ చేయటంతో తాను ఇంతలా రొమాన్స్ చేసినట్లుగా వెల్లడించారు. అషిమా సహకారాన్ని విజయ్ ఆంటోని ప్రత్యేకంగా ప్రస్తావించటం పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.