Begin typing your search above and press return to search.

హాట్‌ ఆండ్రియాతో మాస్టర్ గుస‌గుస‌లేమిటో

By:  Tupaki Desk   |   21 Dec 2020 2:47 PM GMT
హాట్‌ ఆండ్రియాతో మాస్టర్ గుస‌గుస‌లేమిటో
X
దివాళీ దీపాన్ని ఊరించే అందాన్ని! అంటూ ద‌డ సినిమాలో అదిరిపోయే పాట పాడింది ఆండ్రియా. సినిమా ఫ్లాపైనా ఆండ్రియా సాంగ్ ఫ్లాప్ కాలేదు. ప్ర‌తిసారీ ఎఫ్‌.ఎంలో వినిపించేది. టీవీల్లోనూ విజువ‌ల్స్ ఆక‌ట్టుకునేవి. ఇక ఆండ్రియా ఏ సినిమాలో న‌టించినా ఆ సినిమాలో త‌నదైన‌ అందం వ‌య్యారంత క‌ట్టిప‌డేస్తుంది. అలాంటి ఆండ్రియా ఇప్పుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టిస్తున్న `మాస్ట‌ర్`లో కీల‌క పాత్ర‌ను పోషిస్తూ సెంట‌రాఫ్ ఎట్రాక్ష‌న్ గా మారింది.

నేడు ఆండ్రియా జెరెమియా పుట్టినరోజు సంద‌ర్భంగా చాలామంది ప్రముఖులు సోషల్ మీడియాలో తమ హృదయపూర్వక శుభాకాంక్షలను తెలిపారు. తాజాగా `మాస్టర్` మేకర్స్ ఒక ప్రత్యేక ఫోటోను విడుదల చేశారు. ఆండ్రియా విజయ్ పక్కన కూర్చుని ఏదో గుస‌గుస‌గా మాట్లాడేస్తుండ‌డం ఈ ఫోటోలో క‌నిపిస్తోంది. లేత గోధుమరంగు రంగు చీరలో త‌ళుక్కున మెరుస్తున్న ఆండ్రియా కి చేరువ‌గా విజయ్ నీలిరంగు చొక్కాలో కనిపించారు. మాస్ట‌ర్ నుంచి మొట్టమొదటి ఫోటో ఇది అని మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ద‌ళ‌పతి విజయ్ స‌ర‌స‌న మాళ‌విక మోహనన్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. విజయ్ సేతుపతి ప్రధాన విల‌న్ గా న‌టిస్తుండ‌గా.. ఆండ్రియా జెరెమియా.. శాంతను భాగ్యరాజ్ .. అర్జున్ దాస్ కొన్ని కీలక పాత్రలు పోషిస్తున్నారు. సమ్మర్ 2020 కి విడుద‌ల కావాల్సి ఉన్నా.. COVID 19 వ్యాప్తి చెందడంతో కుద‌ర‌లేదు. 2021 సంక్రాంతి బ‌రిలో దిగ‌నుంది.

ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్ర‌న్ సంగీతం అందించారు. ఇటీవ‌ల‌ ఆడియో ట్రాక్ ‌లు రిలీజ‌య్యాయి. అన్ని పాటలు మెగా హిట్ గా మారాయి. విజయ్ రాజకీయారంగేట్రంపై ఆన్ ‌లైన్ ‌లో పుకార్లు వ‌చ్చాక‌ నవంబర్ 14 న ఈ టీజర్ విడుదలైంది. టీజర్ విడుదలైన కొన్ని రోజుల్లో మిలియన్ల వ్యూస్ అందుకుంది. పొంగల్ 2021 లో ఈ చిత్రం పెద్ద తెరపైకి వస్తుందని ఖ‌రారు చేస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదలపై ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న ఏదీ రాలేదు.