Begin typing your search above and press return to search.

మైక్ టైసన్ నన్ను కొడతాడని అమ్మ చాలా భయపడింది: VD

By:  Tupaki Desk   |   23 July 2022 8:31 AM GMT
మైక్ టైసన్ నన్ను కొడతాడని అమ్మ చాలా భయపడింది: VD
X
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన పాన్ ఇండియా స్పోర్ట్ యాక్షన్ ఫిల్మ్ ''లైగర్''. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఇందులో విజయ్ ఎంఎంఏ ఫైటర్ గా నటించగా.. బాక్సర్ లెజెండ్ మైక్ టైసన్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే టైసన్ తో కలిసి నటిస్తున్నానని తెలిసి విజయ్ తల్లి బాగా భయపడిందనని తెలుస్తోంది.

'లైగర్​' సినిమాలో మైక్​ టైసన్ మరియు విజయ్​ దేవరకొండ మధ్య సన్నివేశాల చిత్రీకరణ​​​ కోసం టీమ్​ అంతా ఆ మధ్య అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే టైసన్​ తో షూటింగ్​ అని తెలిసి తన తల్లి ఆందోళన చెందినట్లు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్​ వెల్లడించారు.

ముంబైలో జరిగిన 'లైగర్' హిందీ ట్రైలర్​ లాంచ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ''మైక్ టైసన్​ నన్ను గాయ పరుస్తాడని.. నా ఎముకలు విరగ్గొడతారని మా అమ్మ చాలా భయపడిపోయింది. నాకు ఏమీ కాకూడదని చాలా పూజలు ప్రార్థనలు చేసింది. నేను బాగుండాలని షూటింగ్ కోసం అమెరికాకు వెళ్లేముందు నా నుదుటిపై విభూతి కూడా పెట్టింది. అయితే అలాంటిదేం జరగలేదు. షూటింగ్​ కూల్​ గా జరిగిపోయింది. అందుకే ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నాను'' అని అన్నాడు.

'లైగర్​' నిర్మాతల్లో ఒకరైన ఛార్మీ కౌర్ కూడా విజయ్​ తల్లి భయపడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ''విజయ్ మదర్ నిజంగా చాలా ఆందోళన చెందారు. అమెరికాకు షూటింగ్​ కు వెళ్లే ముందు కూడా చాలాసార్లు ఫోన్​ చేసింది. 'నా చిన్నూకు ఏమీ కాకుండా చూడండి' అని పదే పదే చెప్పింది. విజయ్​ ను ఇంట్లో చిన్నూ అని పిలుస్తారు.​ షూటింగ్​ అంతా బాగానే జరుగుతుందని వీడియోలు చూపించిన తర్వాతే ఆమె రిలాక్స్​ అయ్యారు" అని ఛార్మీ తెలిపింది.

విజయ్ దేవరకొండ అమ్మ ఇలా మైక్ టైసన్ గురించి ఆందోళన చెందడానికి కారణం లేకపోలేదు. ప్రపంచ బాక్సింగ్ చరిత్రలోనే ఎన్నో సంచలనాలు సృష్టించిన మైక్.. ఆవేశపరుడిగా ముక్కోపిగా అందరికీ గుర్తిండి పోయాడు. 1997లో ఆవేశంతో తోటి బాక్సర్ హోలీఫీల్డ్ చెవి కొరికి బాక్సింగ్ నుంచి సస్పెండ్ చేయబడిన సంఘటన బాక్సింగ్ చరిత్రలోనే సెన్సేషన్ గా నిలిచింది.

అలాంటి మైక్ టైసన్ ఇప్పుడు 'లైగర్' లో నటిస్తుండటంతో తన పవర్ ఫుల్ పంచ్ లతో ప్రత్యర్ధులను మట్టికరిపించిన ఆయన.. విజయ్ ను కూడా అలాగే కొడతాడని ఆమె భావించి ఉండొచ్చు. అందుకే తన కొడుక్కి ఏం జరుగుతుందో అని ఆందోళన చెందింది.

'లైగర్' అనే మైక్ టైసన్ నటిస్తున్న ఫస్ట్ ఇండియన్ సినిమా. ఆగస్ట్ 25న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఇందులో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. రమ్యకృష్ణ - రోనీత్ రాయ్ - విష్ణు రెడ్డి కీలక పాత్రలు పోషించారు. పూరీ కనెక్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని రూపొందించారు.