Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా ద‌ళ‌ప‌తి 65

By:  Tupaki Desk   |   4 March 2021 1:30 AM GMT
పాన్ ఇండియా పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా ద‌ళ‌ప‌తి 65
X
త‌మిళ స్టార్ హీరో ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ ఓ సినిమా చేస్తున్నారు అంటే ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌తో పాటు.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతుంటుంది. అత‌డు ఎంచుకునే కాన్సెప్టుల్లో అంత‌టి వైవిధ్యం ఉంటుంది. ఇంత‌కుముందు అదిరింది చిత్రంలో పొలిటిక‌ల్ నేప‌థ్యం వివాదాల గురించి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి బ‌రిలో వ‌చ్చిన మాస్ట‌ర్ మునుప‌టి సినిమాల‌కు భిన్న‌మైన‌ది.

ఇప్పుడు నెల్సన్ దిలీప్‌కుమార్ చిత్రం కూడా రాజ‌కీయాల నేప‌థ్యంలోని క‌థాంశంతో రూపొంద‌నుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతానికి ఈ సినిమాకి # ద‌ళ‌పతి 65 వ‌ర్కింగ్ టైటిల్. చిత్ర‌బృందం నుంచి ఒక మాసివ్ అప్ ‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కోలమావు కోకిలా లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని తెర‌కెక్కించిన‌ నెల్సన్ దిలిప్‌కుమార్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇది పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్.. రాజ‌కీయ నేప‌థ్యం హైలైట్ గా ఉంటుంద‌ని తెలిసింది. తాజా స‌మాచారం మేర‌కు ద‌ళ‌ప‌తి 65 మార్చి 15 నుండి సెట్స్ పైకి వెళుతుంది.

ప్ర‌స్తుతం చిత్ర‌బృందం ప్రీ-ప్రొడక్షన్ ప‌నుల్లో బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే షెడ్యూల్స్ ని ప్లాన్ చేశారని ..ఈ చిత్రాన్ని దీపావళి 2021 న విడుదల చేయాలని భావిస్తున్నారని కూడా చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి చిత్ర‌ బృందం నుండి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.

ద‌ళ‌పతి చిత్రం నన్బన్ (2012) కి ప‌ని చేసిన పాపుల‌ర్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస ద‌ళ‌పతి 65 కి ప‌ని చేయ‌నున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజ్ కానుంద‌ని మ‌నోజ్ ప‌ర‌మ‌హంస వెల్ల‌డించారు.