Begin typing your search above and press return to search.

సూర్య సినిమా.. రీమేక్ కాని రీమేక్

By:  Tupaki Desk   |   21 Dec 2017 4:14 AM GMT
సూర్య సినిమా.. రీమేక్ కాని రీమేక్
X
రీమేక్ అనగానే ఉన్నదున్నట్లుగా దించేస్తారు కొందరు దర్శకులు. మరికొందరు మాత్రం ఒరిజినల్ లోని మూల కథను తీసుకుని మార్పులు చేర్పులు చేసి.. తమదైన ట్రీట్మెంట్ తో సినిమాను తీర్చిదిద్దుదుంటారు. ‘దబాంగ్’ సినిమాను తీసుకుని హరీష్ శంకర్.. ‘గబ్బర్ సింగ్’గా అదే తరహాలో మలిచాడు. దీని ఒరిజినల్ తో పోలిస్తే ఇది చాలా భిన్నంగా అనిపిస్తుంది. దీని టోనే వేరుగా ఉంటుంది.

ఇప్పుడు ‘స్పెషల్ చబ్బీస్’ సినిమా రీమేక్ ‘గ్యాంగ్’ కూడా ఆ తరహాలోనే ఉంటుందట. నాలుగేళ్ల కిందట హిందీలో సూపర్ హిట్టయిన ‘స్పెషల్ చబ్బీస్’ ఆధారంగానే ‘గ్యాంగ్’ సినిమా తీశాడు దర్శకుడు విఘ్నేష్ శివన్. ఐతే తాను హిందీ నుంచి ఉన్నదున్నట్లుగా సినిమా తీసేయలేదని అతనంటున్నాడు. అదే సమయంలో కాన్సెప్ట్ కాపీ కొట్టేసి ఫ్రీమేక్ కూడా చేయలేదని అతనన్నాడు. లీగల్ సమస్యలు రాకూడదనే ‘స్పెషల్ చబ్బీస్’ రైట్స్ అధికారికంగానే కొనుగోలు చేసినట్లు అతను చెప్పాడు.

సీనియస్ గా సాగే ‘స్పెషల్ చబ్బీస్’ను ఉన్నదున్నట్లుగా తీస్తే ఇక్కడ ప్రేక్షకులకు నచ్చకపోవచ్చని.. అందుకేు సౌత్ నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసి ‘గ్యాంగ్’ను తీర్చిదిద్దానని విఘ్నేష్ శివన్ తెలిపాడు. తాను ఈ సినిమా కోసం పడ్డ కష్టమేంటన్నది సినిమా చూస్తే తెలుస్తుందని అతనన్నాడు. తమిళంలో ‘తానా సేంద కూట్టం’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కింది. సూర్య సరసన కీర్తి సురేష్ నటించిన ఈ చిత్రంలో కార్తీక్.. రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. జనవరి 12న రెండు భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది.