Begin typing your search above and press return to search.

ప్రేమ‌లో మునిగిపోయిన ల‌వ్ బ‌ర్డ్స్‌

By:  Tupaki Desk   |   16 Feb 2018 11:07 AM GMT
ప్రేమ‌లో మునిగిపోయిన ల‌వ్ బ‌ర్డ్స్‌
X
ప్రేమ మైకంలాంటిదంటారు... అందులో ప‌డిన వారికి చుట్టుప‌క్క‌ల ప్ర‌పంచంతో ప‌ని లేదు. ఇప్పుడు ఆ స్టార్ హీరోయిన్ త‌న ప్రియుడైన యంగ్ డైరెక్ట‌ర్‌తో అలానే చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతోంది. వారిద్ద‌రి జోడీ చూస్తుంటే... చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది.

న‌య‌న‌తార చిట్ట‌చివ‌రికి... త‌న ఆలోచ‌న‌ల‌కు త‌గిన వ్య‌క్తిని క‌లుసుకుంట‌నే అనుకోవ‌చ్చు. వ‌రుస ల‌వ్ ఫెయిల్యూర్ల‌తో స‌త‌మ‌త‌మైన ఆమె కొన్నాళ్ల పాటూ ఏకాంతంగా ఉండిపోయింది. ఆ త‌రువాత త‌మిళ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్‌ తో సినిమాలో న‌టించి... అత‌నితోనే ప్రేమ‌లో ప‌డింది. వీరిద్ద‌రూ ఇప్పుడు చూడ‌చక్క‌ని జంట అయిపోయారు. వారిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ బాగానే పండిన‌ట్టు ఫోటోల‌ను బ‌ట్టి అర్థ‌మైపోతోంది. అంతేకాదు వారిద్ద‌రూ పెళ్లి చేసుకోవ‌డానికి సిద్ధ‌మైన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఇప్ప‌టికే విఘ్నేష్ శివ‌న్ త‌న ఇంట్లోని వారికి న‌య‌న‌ను చూపించ‌డం... వారు కూడా పెళ్లికి ఒప్పుకున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపించాయి. అందుకేనేమో ఈ ప్రేమ‌జంట ప‌బ్లిక్‌ గానే తిర‌గ‌డం మొద‌లుపెట్టింది.

తాజాగా వారిద్ద‌రి ఫోటో ఒక‌టి నెట్‌ లో వైర‌ల్ అవుతోంది. చుట్టుప‌క్క‌ల ప్ర‌పంచాన్ని కూడా గాలికొదిలేసి ఇద్ద‌రూ రొమాన్స్‌ లో మునిగిపోయారు. టీష‌ర్టులు కూడా దాదాపు ఒకేలాంటివి వేసుకున్నారు. ఆ ఫోటోలో న‌య‌న్‌-శివ‌న్ చాలా క్యూట్ పెయిర్ అనిపించారు.