Begin typing your search above and press return to search.

లేటెస్ట్‌: ప్రేమ‌జంట పెళ్లి తేదీ ఫిక్స్

By:  Tupaki Desk   |   28 Sep 2019 10:19 AM GMT
లేటెస్ట్‌: ప్రేమ‌జంట పెళ్లి తేదీ ఫిక్స్
X
క్రేజీ హీరోయిన్ న‌య‌న‌తార గ‌త కొంత కాలంగా యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివ‌న్ తో ప్రేమాయ‌ణం సాగిస్తోంది. కోలీవుడ్ తో పాటు ద‌క్షిణాదిలో ఏ అవార్డు ఫంక్షన్ జ‌రిగినా ఈ జంట అక్క‌డ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నారు. సెల్ఫీల‌తో హంగామా చేస్తున్నారు. సోష‌ల్ మీడియా ఇన్ స్టాలో ఈ ఇద్ద‌రి ర‌చ్చ మ‌మూలుగా లేదు. వ‌రుస అభిమానుల‌కు సెల్ఫీల‌ను పంచుకుంటూ నిత్యం వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఇద్ద‌రి ప్రేమ వ్య‌వ‌హారం గ‌త కొంత కాలంగా కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన విష‌యం తెలిసిందే. ఇంత ఘాటుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఇప్ప‌టికే ర‌హ‌స్యంగా వివాహం చేసుకున్నార‌ని గ‌త కొంత కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ జంట ఇంకా పెళ్లి చేసుకోలేద‌ని డేటింగ్ లో మాత్ర‌మే వున్నార‌ని త్వ‌ర‌లోనే వివాహం చేసుకోబోతున్నార‌ని తెలిసింది. మొన్న‌టికి మొన్న ఈ ఇద్ద‌రు క‌లిసి గ్రీస్ లో ప‌ర్య‌టించారు. ఆ ఫొటోల్ని ఇన్ స్టా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు. అక్క‌డే విఘ్నేష్ శివ‌న్ బ‌ర్త్ డే సెల‌బ్రేట్ చేసుకున్నాడు. ఆ ఫొటోల్లో న‌య‌న్‌- విఘ్నేష్‌ల కెమిస్ట్రీ ఫోటోలు ఇప్ప‌టికే రిలీజ‌య్యాయి. ఆ ఫోటోలు చూసిన వారి త‌ల్లిదండ్రులు వెంట‌నే ఇద్ద‌రికి వివాహం చేయాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చార‌న్న‌ది ఎవ్వ‌ర్ లేటెస్ట్ అప్ డేట్. చాలా రోజులుగా మంచి ముహూర్తం కోసం ఎదురుచూసిన కుటుంబ స‌భ్యులు ఈ ఏడాది డిసెంబ‌ర్ లో పెళ్లి చేయ‌డానికి ముహూర్తం ఫిక్స్ చేసిన‌ట్లు తెలిసింది. డిసెంబ‌ర్ 25న విదేశాల్లో వీరి వివాహం చేయ‌డానికి నిర్ణ‌యించార‌ట‌.

డెస్టినేష‌న్ వెడ్డింగ్ త‌ర‌హాలో అట్ట‌హాసంగా జ‌ర‌గ‌బోయే న‌య‌న్ - విఘ్నేష్ జంట‌ వివాహానికి తెలుగు.. త‌మిళ ఇండస్ట్రీల‌కు చెందిన స్టార్ సెల‌బ్రిటీస్ అంతా పాల్గొనే అవ‌కాశం వుందని త‌మిళ చిత్ర వ‌ర్గాల్లో వినిపిస్తోంది. న‌య‌న‌తార ప్ర‌స్తుతం తెలుగులో చిరుతో `సైరా న‌ర‌సింహారెడ్డి`.. త‌మిళంలో విజ‌య్ తో `బిగిల్‌`.. ర‌జ‌నీతో `ద‌ర్బార్‌` చిత్రాల్లో న‌టిస్తోంది. `సైరా` అక్టోబ‌ర్ 2న విడుద‌ల కాబోతోంది.