Begin typing your search above and press return to search.

లవర్ కోసం డ్రైవర్ గా మారిన డైరెక్టర్

By:  Tupaki Desk   |   3 Dec 2018 5:34 PM GMT
లవర్ కోసం డ్రైవర్ గా మారిన డైరెక్టర్
X
పేరుకు తమిళ స్టార్ హీరోయిన్ అయినా నయనతారకు సౌత్ మొత్తం మీద హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ అనే పేరు. యువ హీరోలతో జోడీ కట్టడంతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి లాంటి సీనియర్ స్టార్స్ తో జత కడుతూ ఆడియన్స్ ను మెప్పిస్తోంది నయన్. ప్రొఫెషన్ సంగతి పక్కనబెడితే పర్సనల్ లైఫ్ లో దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయన్ ప్రేమాయణం ఓపెన్ సీక్రెట్.

కోలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో నయన్-విఘ్నేష్ లు ఇద్దరూ లవర్స్ కాదని.. ఇద్దరికీ ఎప్పుడో రహస్యంగా పెళ్ళయిపోయిందని.. ఆ విషయం బయటకు చెప్పకుండా కవర్ చేస్తున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే నయనతార రీసెంట్ గా ఒక జాగ్వార్ బ్రాండ్ లగ్జరీ కారును కొనుక్కుందట. నయన్ కు ఇప్పటికే బీఎండబ్ల్యూ కారు ఒకటుంది. దీంతో చెన్నై సిటీలో షూటింగులు ఉంటే కొత్త జాగ్వార్ కారును .. నగరానికి వెలుపల షూటింగులు ఉంటే బీఎండబ్ల్యూ కారును వాడుతోందట. అయితే కొత్త జాగ్వార్ కారును మాత్రం రెగ్యులర్ డ్రైవర్ కు ఇవ్వడం లేదట. ఆ కారుకు విఘ్నేష్ డ్రైవర్ గా మారాడట. జీతానికి కాదులెండి. ప్రియురాలిపై ఉన్న అపరిమితమైన ప్రేమతో.

చెన్నై లో ఎప్పుడు షూటింగ్ ఉన్నా తనే జాగ్వార్ కారులో తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కు తీసుకొస్తున్నాడట. అంతే కాదు.. నయన్ దగ్గరకు వచ్చే కథలను తనే వింటూ ఆమెకు సహాయం చేస్తున్నాడట. ఇదంతా చూస్తుంటే నయన్ ప్రేమలో విఘ్నేష్ హిమాలయాల అంచుల దాకా వెళ్ళినట్టు అనిపించడం లేదూ..?