Begin typing your search above and press return to search.

అమెరికాలో ప్రియుడితో నయన చెక్కర్లు

By:  Tupaki Desk   |   18 Sep 2017 7:32 AM GMT
అమెరికాలో ప్రియుడితో నయన చెక్కర్లు
X
సౌత్ బ్యూటీ నయనతార తన పర్సనల్ విషయాలను దాచుకునేందుకు ఏ మాత్రం సందేహించదు. ఆమె లవ్ స్టోరీలు.. బ్రేకప్ లు అన్నీ జనాలకు తెలిసినవే. వాటి గురించి ఆమె ఎక్కడా మాట్లాడకపోయినా.. ఏం జరిగిందో.. ఇప్పుడేం జరుగుతోందో అందరికీ ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. ఇప్పుడు దర్శకుడు విఘ్నేష్ తో నయన్ పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ కలిసి కాపురం చేసేస్తున్నారని.. కెరీర్ కోసమే పెళ్లి పక్కన పెట్టారనే టాక్ కూడా ఉంది.

ఇందులో నిజానిజాల గురించి వీరెవరూ కామెంట్ చేయలేదు కానీ.. వీరి ప్రవర్తన మాత్రం దీన్ని సపోర్ట్ చేస్తున్నట్లే ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రేమ జంట అమెరికాలో చక్కర్లు కొడుతున్నారు. ఇద్దరూ కలిసి అక్కడ ఎంజాయ్ చేస్తున్న సందర్భాలను ఫోటోల ద్వారా నెట్ లో పెట్టి చూపిస్తున్నాడు విఘ్నేష్ శివన్. బ్రూక్లిన్ బ్రిడ్జ్ దగ్గర నయన్ తో పాటు తాను ఎంజాయ్ చేస్తున్న ఫోటోను నెట్ లో షేర్ చేశాడు ఈ దర్శకుడు. మరోవైపు.. ఈ టూర్ కి విఘ్నేష్ బర్త్ డే కూడా కలిసొచ్చింది.

చూసేందుకు అలా అనిపిస్తున్నా.. తన ప్రియుడి పుట్టిన రోజు నాటికి యూఎస్ లో ఉండేలా జాగ్రత్తగా ప్లాన్ చేసి మరీ తీసుకెళ్లిందట నయనతార. ఇక సినిమాల విషయానికి వస్తే సూర్యతో సినిమాను విఘ్నేష్ పూర్తి చేస్తుండగా.. బాలయ్య 102తో పాటు మెగాస్టార్ 151 సైరా చిత్రంలో నటిస్తోంది నయనతార.