Begin typing your search above and press return to search.

నా జీవితం పరిపూర్ణమైంది: నయన్ బర్త్ డే ఫంక్షన్లో విఘ్నేశ్

By:  Tupaki Desk   |   18 Nov 2021 10:31 AM GMT
నా జీవితం పరిపూర్ణమైంది: నయన్ బర్త్ డే ఫంక్షన్లో విఘ్నేశ్
X
నయనతార .. విఘ్నేశ్ శివన్ ప్రేమించుకుంటున్నారనే విషయం అందరికీ తెలిసిందే. దర్శకుడిగా విఘ్నేశ్ .. హీరోయిన్ గా నయన్ ఇద్దరూ ఎవరి సినిమాలతో వారు బిజీగానే ఉన్నారు. ఇద్దరికీ తీరిక దొరికితే ఎంచక్కా విదేశాలకి వెళ్లిపోయి సరదాగా అలా అలా షికారు చేసి వస్తారు.

ఒకరి పట్ల ఒకరికి గల ప్రేమానురాగాలను వ్యక్తం చేసే ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వదులుతూనే ఉంటారు. తమ ప్రేమకథను జనం చెప్పుకునేలా చేస్తూనే ఉంటారు.

ఈ రోజున నయనతార పుట్టినరోజు .. అందువలన బుధవారం రాత్రి 12 దాటగానే విఘ్నేశ్ శివన్ .. నయనతారతో కేక్ కట్ చేయించి సందడి చేశాడు. కేక్ కట్ చేయడానికి ముందు విఘ్నేశ్ ను నయన్ ప్రేమగా హత్తుకుంది. ఆయన ఆమెను ఆలింగనం చేసుకున్నాడు.

ఆ తరువాతనే కేక్ కటింగ్ మొదలైంది. ఈ వేడుకకు సమంత కూడా హాజరైంది. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో జోరుగా షికారు చేస్తున్నాయి. పలువురు సినిమా ప్రముఖులతో పాటు నయన్ అభిమానులు ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు.

ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ స్వీయ నిర్మాణంలో 'కాతువాకుల రెండు కాదల్' సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి .. నయనతార .. సమంత ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి, విజయ్ సేతుపతి .. సమంత ఫస్టులుక్స్ ను వదిలారు.

నయనతార బర్త్ డే సందర్భంగా ఆమె ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆమె 'కన్మణి' అనే పాత్రలో కనిపించనుందనే విషయం ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది.

ఈ పోస్టర్ ను ఇన్ స్టాతో పంచుకున్న విఘ్నేశ్, నయనతారకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఆమె ప్రేమతో .. ఆప్యాయతతో తన జీవితం పరిపూర్ణమైందని రాసుకొచ్చాడు. ఆమె ఎప్పటికీ అలాగే అందంగా .. ఆనందంగా ఉండాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఆ భగవంతుడి ఆశీస్సులు ఆమెకు ఎప్పటికీ ఉండేలా కోరుకుంటున్నానని అన్నాడు. అలా నయన్ బర్త్ డే వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఇక త్వరలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.