Begin typing your search above and press return to search.

వర్మ మాటలు.. రికార్డు చేసి షేర్ చేశాడు..

By:  Tupaki Desk   |   14 April 2017 3:39 AM GMT
వర్మ మాటలు.. రికార్డు చేసి షేర్ చేశాడు..
X
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పెట్టే మిడ్ నైట్ ట్వీట్స్ గురించి చాలా మందికి తెలిసిన విషయమే. ఎక్కడ లేని విషయాలు.. తనకు అవసరం లేని అంశాలు.. లక్షల మందిని రెచ్చగొట్టి వినోదం చూసే కాన్సెప్టులు.. ఇలాంటివన్నీ వర్మకు అర్ధరాత్రే గుర్తు రావడానికి అసలు సిసలైన కారణం.. 'వోడ్కా'. ఈ విషయం అందరికీ తెలిసిందే కానీ.. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టించేశాడు బాలీవుడ్ హీరో విద్యుత్ జమాల్.

తాగేసి నోటికొచ్చినల్లా వాగడం.. చేతికొచ్చిందల్లా రాయడం వర్మకు కొత్తేమీ కాదు కానీ.. ఆ విషయంలో దొరికిపోవడమే కొత్త. తాజాగా ఫుల్లుగా వోడ్కా పట్టించేసి రాంగోపాల్ వర్మ నోటికొచ్చిందల్లా వాగితే.. దానికి సంబంధించిన ఆడియో టేపును ఇంటర్నెట్ లో షేర్ చేశాడు విద్యుత్ జమాల్. ఎవరు రికార్డ్ చేశారనే విషయం తెలియదు కానీ.. 'షావలిన్ సాధువు స్టైల్ మర్చిపోండి.. ఓ సారి రాంగోపాల్ వర్మ డ్రంకెన్ మాస్టర్ స్టైల్ చూడండి' అంటూ వర్మ తాగేసి నోటికొచ్చిందల్లా మాట్లాడిన ఆడియో క్లిప్పింగ్ ను నెట్ లో షేర్ చేసేశాడు.

ఈ ఆడియోలో చాలా అభ్యంతరకమైన పదజాలం ఉపయోగించాడు వర్మ. అంతే కాదు.. యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ ను ఏకంగా ట్రాన్స్ జెండర్ అనేశాడు. ఇలా వర్మ పరువును విద్యుత్ జమాల్ సోషల్ మీడియాలో తీసేయడానికి కారణం ఉంది. టైగర్ ష్రాఫ్.. విద్యుత్ జమాల్ లు ఇద్దరూ కొట్టుకుంటే తనకు వినోదం చూడాలని ఉందంటూ.. రెండు రోజుల క్రితం ట్విట్టర్ పిట్టతో వర్మ బోలెడన్ని కూతలు కూయించాడు. దానికి రిటార్ట్ ఇలా ఉంటుందని వర్మ ఊహించి ఉండడు కదా.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/