Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: ఎన్టీఆర్ విలన్ చెలరేగిపోయాడు

By:  Tupaki Desk   |   25 Jan 2017 10:35 AM GMT
ట్రైలర్ టాక్: ఎన్టీఆర్ విలన్ చెలరేగిపోయాడు
X
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘శక్తి’.. ‘ఊసరవెల్లి’ సినిమాల్లో విలన్ పాత్రలు చేసిన విద్యుత్ జమాల్ గుర్తున్నాడా? మురుగదాస్ మూవీ ‘తుపాకి’లో మెయిన్ విలన్ పాత్రలో అదరగొట్టేసి సౌత్ ఇండియాలో మాంచి ఫాలోయింగ్ సంపాదించిన ఈ కండల వీరుడు.. బాలీవుడ్లో హీరోగా కూడా నటించాడు. అతను కథానాయకుడిగా మూడేళ్ల కిందట ‘కమాండో’ అనే సినిమా వచ్చింది. మంచి విజయమే సాధించింది. కంటెంట్ కొంచెం వీక్ అయినా.. విద్యుత్ అద్భుత యాక్షన్ విన్యాసాలు మాస్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమా సాధించిన విజయంతో దానికి సీక్వెల్ కూడా తెరకెక్కింది. అదే.. కమాండో-2.

ఇటీవలే విడుదలైన ‘కమాండో-2’ ట్రైలర్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ‘కమాండో’లో కంటే బాగా కండలు పెంచి.. బలంగా తయారయ్యాడు విద్యుత్. యాక్షన్ సీన్లలో మరింతగా రెచ్చిపోయాడు. హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు దీటుగా ఇందులో ఫైట్లు కంపోజ్ చేసినట్లున్నారు. డూపుల్లేకుండా తనే స్వయంగా ఈ ఫైట్లన్నీ చేశాడట విద్యుత్. అతడి విన్యాసాలే ట్రైలర్ కు ఆకర్షణగా నిలిచాయి. ‘హార్ట్ అటాక్’ భామ ఆదా శర్మ ఇందులో కథానాయికగా నటించడం విశేషం. ఈషా గుప్తా మరో కీలక పాత్ర చేసింది. బ్లాక్ మనీ గుట్టు రట్టు చేసే కమాండో కథ ఇది. ప్రస్తుతం నల్లధనం మీద పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ కాన్సెప్ట్ కంటెంపరరీగా ఉంటుందని దాన్నే కథాంశంగా తీసుకున్నట్లున్నారు. దేవేన్ భోజాని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకొస్తుంది.





Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/