Begin typing your search above and press return to search.

హ్యాక్ అయిన కమెడియన్ ఫేస్ బుక్

By:  Tupaki Desk   |   4 July 2018 10:49 PM IST
హ్యాక్ అయిన కమెడియన్ ఫేస్ బుక్
X
2012 లో 'ఎటో వెళ్ళిపోయింది మనసు' సినిమాతో అరంగేట్రం చేసింది కమెడియన్ విద్యు రామన్. మొన్న విడుదల అయిన ఆచారి అమెరికా యాత్ర సినిమా వరకు - లేడీ కమెడియన్ పాత్రల్లో కనిపిస్తూ అలరిస్తూ ఉంది విద్యు. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టీవ్ గా ఉంటూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉండే విద్యు అకౌంట్ హాక్ అయింది.

తన ఫేస్ బుక్ అకౌంట్ హాక్ అయింది అంటూ స్క్రీన్ షాట్లు తీసి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఫ్యాన్స్ కి తెలియజేసింది. అకౌంట్ హ్యాకింగ్ అనేది ఒక పెద్ద సమస్యలా తయారైంది ఈ కాలంలో. కేవలం మాములు వాళ్లే కాక సెలెబ్రిటీలు కూడా ఇలా బాధితులు అవుతున్నారు. " ఒక వింత మరియు భయంకరమైన సంఘటన జరిగింది. విద్యు రామన్ అని ఉండే నా ఫేస్ బుక్ పేజీ హ్యాక్ అయ్యింది." అంటూ ట్వీట్ చేసింది విద్యు. తన పేరుని మార్చి రమ్య అని ఆ హ్యాకర్ పెట్టడంతో ఇప్పుడు తన 450K ఫాలోయర్లు ఎవరినో ఫాలో అవుతున్నట్టు అయింది.

తను తప్ప ఇంకెవరు తన అకౌంట్ వాడరని, ఇదెలా జరిగిందో తనకు అర్థంకావటంలేదని, నిందితుడిని పట్టుకుతీరాలని తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన విద్యు ఫేస్ బుక్ ఎదో ఒకటి చేయాలని విన్నవిస్తూ సైబర్ క్రైమ్ లో రిపోర్ట్ నమోదు చేస్తానని కామెంట్ ద్వారా తెలియజేసింది. హ్యాక్ చేసిన వ్యక్తి కేవలం పేరు మార్చడమే కాక కొన్ని ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు.