Begin typing your search above and press return to search.

అక్కడ బ్యాగ్ పోయింది.. ఇక్కడ పోలీస్ అయింది

By:  Tupaki Desk   |   13 July 2016 8:30 AM GMT
అక్కడ బ్యాగ్ పోయింది.. ఇక్కడ పోలీస్ అయింది
X
క్రేజ్ విషయంలో కొన్నిసార్లు ట్యాలెంట్ తో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. కామెడీ పాత్రల్లో కనిపించే విద్యుల్లేఖకు ఇప్పుడు మంచి టైమ్ స్టార్ట్ అయిపోయింది. సరైనోడు సినిమాలో అల్లు అర్జున్ కి వదినగా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న విద్యుల్లేఖ.. ఆ మధ్య వియన్నా వెళ్లి బ్యాగ్ పోగొట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడీమె వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి.

ప్రస్తుతం అనుష్క శెట్టి చేస్తున్న మూవీ భాగమతిలో.. విద్యుల్లేఖకు మంచి ఆఫర్ వచ్చింది. కమెడియన్ గా మరో మెట్టు ఎక్కే అవకాశం వచ్చిందనే విషయం.. ఆమె కేరక్టర్ చూస్తే అర్ధమవుతోంది. భాగమతిలో ఓ పోలీస్ పాత్రలో కనిపించి నవ్వించనుందట విద్యు. ఆ విషయాన్ని తనే సోషల్ మీడియా ద్వారా వివరించింది. 'కొంతకాలం తర్వాత మళ్లీ ఖాకీ డ్రస్ వేస్తున్నా. అనుష్క ప్రధాన పాత్రలో యూవీ క్రియేషన్స్ బేనర్ పై రూపొందుతున్న లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లో కామెడీ పోలీస్ పాత్ర చేస్తున్నాను' అని చెప్పింది విద్యు రామన్.

అంతే కాదు.. సెట్స్ లో తను యూనిఫాంలో ఉన్నపుడు తీసిన ఓ ఫోటోను కూడా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. కాసిన్ని డైలాగులతోనే నవ్వులు పంచేస్తున్న విద్యు.. కామెడీ పోలీస్ రోల్ లో ఇరగదీసేయడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందనుండగా.. ఈ పాత్ర కోసం కొంత బరువు తగ్గానంటోంది విద్యుల్లేఖా రామన్.