Begin typing your search above and press return to search.

మాల్దీవుల్లో విద్యుల్లేఖ హ‌నీమూన్ అదుర్స్

By:  Tupaki Desk   |   19 Sep 2021 9:30 AM GMT
మాల్దీవుల్లో విద్యుల్లేఖ హ‌నీమూన్ అదుర్స్
X
లేడీ క‌మెడియ‌న్ విద్యుల్లేఖా రామ‌న్ ఉన్న ఫ‌లంగా బ‌రువు త‌గ్గి షాకిచ్చిన విష‌యం తెలిసిందే. ఆ విష‌యాన్నే సినీ ప్రియులు డైజెస్ట్ చేసుకునే లోపే మ‌రో షాకిచ్చింది. ఈ నెల 9వ తేదీని ప్రియుడు.. ఫిట్ నెస్ ట్రైన‌ర్ కం న్యూట్రీష‌న్ నిపుణుడు సంజ‌య్ ని విద్యుల్లేఖా రామ‌న్ వివాహం చేసుకుంది. చెన్నైలో త‌మిళ‌- సింధీ సంప్ర‌దాయాల్లో వీరి వివాహం జ‌రిగింది. ఈ వివాహానికి అత్యంత స‌న్నిహితులు.. బంధువులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు.

ఇంత‌కుముందే పెళ్లి ఫోటోలు విడుద‌లై వైర‌ల్ అయ్యాయి..ఇప్పుడు హ‌నీమూన్ కి సంబంధించిన ఫొటోలు వీడియోల‌ను విద్యుల్లేఖా రామ‌న్ తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌కు షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ జంట హ‌నీమూన్ కోసం మాల్దీవ్ ల‌కు వెళ్లారు. అక్క‌డ భ‌ర్త సంజ‌య్ క్లిక్ చేసిన ఫొటోని కూడా విద్యుల్లేఖ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. మాల్దీవుల్లో తన ఫేవ‌రెట్ ప్లేస్ గురించి విద్యుల్లేఖ వెల్ల‌డించింది. ``ప్రతిరోజూ మేల్కొలపడం మిస్ అవుతాను.. సెంట‌రా గ్రాండ్ మాల్దీవ్స్.. ఈ ప్రదేశం నా హృదయాన్ని తాకింది...`` అంటూ పూల్ సైడ్ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసింది.

త‌మిళ చిత్రాల‌తో న‌టిగా కెరీర్ ప్రారంభించిన విద్యుల్లేఖా రామ‌న్ `రామ‌య్యా వ‌స్తావ‌య్యా` చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. త‌మిళ్ కంటె తెలుగు చిత్రాల్లోనే అత్య‌ధికంగా న‌టిస్తున్న విద్యుల్లేఖ హీరోయిన్ ల‌కు స్నేహితురాలి పాత్ర‌లు పోషిస్తూ ఆక‌ట్టుకుంటోంది. కామెడీని పండిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకుంది. రీసెంట్ గా అల్లుడు అదుర్స్‌.. గ‌ల్లీ రౌడీ చిత్రాల్లోనూ న‌టించిన విద్యుల్లేఖా రామ‌న్ త్వ‌ర‌లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ని తెలిసింది.