Begin typing your search above and press return to search.

విద్యాబాల‌న్ నెవ్వ‌ర్ బిఫోర్ హాటెస్ట్ ఫోటోషూట్

By:  Tupaki Desk   |   1 April 2021 7:18 PM IST
విద్యాబాల‌న్ నెవ్వ‌ర్ బిఫోర్ హాటెస్ట్ ఫోటోషూట్
X
గ్లామ‌ర్ ప‌రిశ్ర‌మ‌లో బోల్డ్ బ్యూటీగా సీనియ‌ర్ న‌టి విద్యా బాల‌న్ పాపులర‌య్యారు. ద‌శాబ్ధాల కెరీర్ బండిని విజ‌య‌వంతంగా న‌డిపించేస్తున్న ఈ బ్యూటీ ఇటీవ‌ల కెరీర్ ప‌రంగా కాస్త నెమ్మ‌దించిన‌ట్టే క‌నిపిస్తోంది.

2018లో ఎన్టీఆర్ బ‌యోపిక్ చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా హైద‌రాబాద్ లో సంద‌డి చేసిన ఈ బ్యూటీ ఆ చిత్రంలో బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. త‌న‌దైన న‌ట‌న‌తో నంద‌మూరి అభిమానులు స‌హా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌స్సుపై ఘాడ‌మైన ముద్ర‌నే వేశారు. సినిమా జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా బాల‌న్ న‌ట‌న అంద‌రినీ మెప్పించింది.

అంత‌కుముందు డ‌ర్టీపిక్చ‌ర్ లో సిల్క్ స్మిత‌గా నటించినా.. మిష‌న్ మంగ‌ళ్ లాంటి ఛాలెంజింగ్ మూవీలో మ‌హిళా సైంటిస్టుగా న‌టించినా.. ఆ త‌ర్వాత‌ శ‌కుంత‌లాదేవి (గ‌ణిత‌శాస్త్ర మేధావి) గా న‌టించినా బాల‌న్ లోని విల‌క్ష‌ణ న‌టికి ఫ్యాన్స్ హ్యాట్సాప్ చెప్పారు.

విద్యాబాలన్ ఒక ఫ్యాషనిస్టా‌గా నూ బాలీవుడ్ లో పాపుల‌ర‌య్యారు. విద్యాబాలన్ సాంప్రదాయ దుస్తులను ప్రత్యేకంగా ఇష్టపడినా.. మోడ్ర‌న్ ఔట్ ఫిట్స్ లోనూ బోల్డ్ లుక్ తో అభిమానుల‌కు ట్రీటివ్వ‌డం తన‌లోని విల‌క్ష‌ణ‌త‌కు అద్దం ప‌డుతుంది.

తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో సృజనాత్మకతను జోడించిన‌ సూపర్ కూల్ వీడియోతో ముందుకు వచ్చారు. బ్లాక్ ప‌ర్పుల్ డ్రెస్ లో బోల్డ్ లుక్ తో క‌నిపిస్తున్న బాల‌న్ నెవ్వ‌ర్ బిఫోర్ అన్న‌తీరుగా కెమెరాకి ఫోజులిస్తున్నారు. మ‌రోవైపు `ఉమెన్ బై బో ఏ..` అనే వీడియో సాంగ్ లో బాల‌న్ కనిపించ‌నున్నారని స‌మాచారం.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. విద్యాబాలన్ చివరిసారిగా ప్ర‌సిద్ధ గణిత మేధావిపై బయోపిక్ `శకుంతల దేవి`లో కనిపించారు. అమిత్ మసూర్కర్ దర్శకత్వం వహించిన షెర్నిలో విద్యాబాలన్ నటిస్తున్నారు. విద్యాబాలన్ ఈ చిత్రంలో అటవీ అధికారి పాత్రను పోషిస్తున్నారు. మ‌హ‌మ్మారీ వ‌ల్ల చిత్రీకరణ ఆలస్యం అయింది. పరిణీత- కహానీ- ది డర్టీ పిక్చర్- నో వన్ కిల్డ్ జెస్సికా- కిస్మత్ కనెక్షన్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో బాల‌న్ న‌టించిన సంగతి తెలిసిందే.