Begin typing your search above and press return to search.

తెలుగులో డర్టీ భామ కహానీ

By:  Tupaki Desk   |   29 March 2016 3:08 PM IST
తెలుగులో డర్టీ భామ కహానీ
X
బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ కెరీర్ లో చెప్పుకోదగ్గ పాత్రలు చాలానే ఉంటాయి. గ్లామర్ తో పాటే పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించి ఆకట్టుకుంది విద్యా బాలన్. నో వన్ కిల్లడ్ జెస్సికా వంటి చిత్రాల్లో నటనతో ఆడియన్స్ ను అలరించింది. టాలీవుడ్ అలవాటి ఐటెం సుందరి సిల్క్ స్మిత పాత్రలో చేసిన డర్టీ పిక్చర్ మూవీ తర్వాత... దక్షిణాదిలోనూ ఎనలేని గుర్తింపు విద్యాబాలన్ కు దక్కింది. ఆ తర్వాత వచ్చి కహానీ మూవీ ఈ డర్టీ భామను మరో మెట్టు ఎక్కించింది.

ఇప్పుడీ కహానీకి సీక్వెల్ గా మరో మూవీ స్టార్ట్ అవుతోంది. కహానీ ఎక్కడ ఎండ్ కార్డ్ పడిందో.. అక్కడే కహానీ2 స్టార్ట్ అవుతుందట. అలా సీక్వెల్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయడం, ఆ స్టోరీ విద్యాబాలన్ ను ఆకట్టుకోవడంతో.. వెంటనే ఈమూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది విద్యా బాలన్. గతంలో కహానీ చిత్రాన్ని తెలుగు, తమిళ్ లో అనామిక పేరుతో శేఖర్ కమ్ముల రీమేక్ చేసినా ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో కహానీ2 విషయంలో మాత్రం నిర్మాతలు పక్కా ప్లానింగ్ తో ఉన్నారని అంటున్నారు.

బాలీవుడ్ తో పాటే తెలుగు, తమిళ్ లోనూ ఒకేసారి తెరకెక్కించి, ఒకేసారి రిలీజ్ చేసేలా కహానీ-2 ప్లాన్ చేశారని తెలుస్తోంది. సౌత్ లో విద్యా బాలన్ కు ఉన్న ఇమేజ్, క్రేజ్ కారణంగా.. ఇక్కడ కూడా కహానీ-2 మంచి వసూళ్లు రాబడుతుందని నమ్మకంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పశ్చిమ బెంగాల్ లో షూటింగ్ జరపుకుంటూ ఉండగా.. సుజయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నాడు.