Begin typing your search above and press return to search.

సుశాంత్‌ : మరో స్టార్‌ హీరోయిన్‌ రియాకు మద్దతు

By:  Tupaki Desk   |   2 Sept 2020 7:30 PM IST
సుశాంత్‌ : మరో స్టార్‌ హీరోయిన్‌ రియాకు మద్దతు
X
సుశాంత్‌ మరణించిన రోజు నుండి ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి పై నెటిజన్స్‌ చేస్తున్న ట్రోల్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం సుశాంత్‌ అభిమానులు మాత్రమే కాకుండా ఆయన కుటుంబ సభ్యులు మరియు కొందరు రాజకీయ మరియు సినీ ప్రముఖులు కూడా ఆమెను దోషిగా చూపిస్తూ వ్యాఖ్యలు చేశారు. సుశాంత్‌ చనిపోయిన రెండు నెలల తర్వాత ఆమె మీడియా ముందుకు వచ్చి తన వాదన వినిపించడంతో ఇప్పుడు ఆమెకు మద్దతుగా సినీ వర్గాల వారు మాట్లాడుతున్నారు.

జస్టీస్‌ ఫర్‌ రియా అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ తో సోషల్‌ మీడియాలో రియాను చాలా మంది సమర్ధిస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో సెలబ్రెటీలు కూడా చేరారు. ఇటీవలే మంచు లక్ష్మి ఈ విషయమై మాట్లాడుతూ రియా పై కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఆమె ఇంకా దోషిగా తేలకముందే ఆమెను హంతకురాలు అంటూ సంభోదిస్తున్నారు. రియా విషయంలో మీడియా వ్యవహరిస్తున్న తీరు కూడా ఏమాత్రం సరిగా లేదంటూ సినీ ప్రముఖులు వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ విద్యాబాలన్‌ కూడా రియాకు మద్దతుగా మాట్లాడింది.

ఒక మహిళగా రియాపై జరుగుతున్న ప్రచారంకు నా మనసు చాలా బాధపడింది. కేసు విచారణ ఎదుర్కొంటున్న మాత్రాన ఆమె దోషి అయిపోదు. ఆమె విషయంలో నేరం నిరూపితం అయ్యే వరకు ఆమెను నిర్దోషిగానే భావించాలంటూ విద్యాబాలన్‌ పేర్కొంది. ఇటీవలే సీబీఐ వారు కూడా సుశాంత్‌ ది హత్య అంటూ మాకు ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకు లభ్యం కాలేదు అంటూ పేర్కొన్నారు. దాంతో రియాకు మద్దతు ఇంకా పెరిగే అవకాశం ఉంది.