Begin typing your search above and press return to search.

2 కోట్ల‌న్నా బాల‌య్య ఓకే అన్నాడట!

By:  Tupaki Desk   |   13 July 2018 11:47 AM GMT
2 కోట్ల‌న్నా బాల‌య్య ఓకే అన్నాడట!
X
త‌న తండ్రి బ‌యోపిక్‌ గా రూపొందుతున్న `ఎన్టీఆర్‌` గురించి జాతీయ స్థాయిలో మాట్లాడుకోవాలనేది బాలకృష్ణ కోరిక అంట. అందుకోసం ఆయన పలు జాగ్ర‌త్త‌లు తీసుకొంటున్నాడు. సినిమాకి ఆయన నిర్మాత కూడా కావడంతో ఏ విష‌యంలోనూ రాజీప‌డ‌కుండా స్వేచ్ఛ‌గా నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ట‌. సినిమాకి ఏం కావాలంటే అది క్ష‌ణాల్లో స‌మ‌కూరుస్తున్నట్టు చిత్ర‌వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఎన్టీఆర్ సతీమణి బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యాబాల‌న్ న‌టిస్తే బాగుంటుంద‌ని క్రిష్ చెప్పగానే.. బాల‌కృష్ణ వెంట‌నే గ్రీన్‌ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌. విద్యాబాల‌న్ ఇంటికి స్వ‌యంగా వెళ్లి మా సినిమాలో న‌టించాల‌ని కోరాడ‌ట‌. చిన్న పాత్రయినా ఆమె రూ: 2 కోట్లు పారితోషికం అడిగిన‌ట్టు స‌మాచారం.

అయినా వెన‌క్కి త‌గ్గ‌కుండా బాలయ్య అడిగినంత పారితోషికం ఇవ్వ‌డానికి ఓకే చెప్పేసి ఆమె అంగీకారం పొందాడ‌ట‌. విద్యాబాల‌న్‌ లాంటి క‌థానాయిక సినిమాలో ఉందంటే జాతీయ స్థాయిలో బ‌జ్ వ‌స్తుంది కాబ‌ట్టి, త‌న తండ్రి చిత్రం గురించి మొత్తం మాట్లాడుకోవాల‌నే ఆలోచ‌న‌తోనే బాల‌కృష్ణ ఎక్క‌డా రాజీప‌డ‌కుండా నిర్ణ‌యాలు తీసుకొంటున్న‌ట్టు తెలుస్తోంది. ఒక్క విద్యాబాల‌న్ విష‌యంలోనే కాదు.. టాలీవుడ్‌ లో ప‌లువురు అగ్ర క‌థానాయ‌కుల్ని `ఎన్టీఆర్‌`లో భాగం చేసేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట బాల‌య్య‌. ఈ ప్రాజెక్టులోకి క్రిష్ రావ‌డంతో మ‌రింత క్రేజ్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఈ సినిమాని వ‌చ్చే యేడాది జ‌న‌వరి 9న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.