Begin typing your search above and press return to search.

వీడియో : స్టైలిష్ అల్లు బేబీ క్యూట్‌ ట్రెడీషనల్‌

By:  Tupaki Desk   |   5 July 2021 4:30 AM GMT
వీడియో : స్టైలిష్ అల్లు బేబీ క్యూట్‌ ట్రెడీషనల్‌
X
స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ పిల్లలు అల్లు అయాన్ మరియు అల్లు అర్హ లు రెగ్యులర్‌ గా సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతూనే ఉంటారు. ముఖ్యంగా అల్లు వారి క్యూట్‌ అర్హ నెట్టింట ఎప్పుడు కూడా తన క్యూట్‌ నవ్వుతూ ట్రెండింగ్ లోనే ఉంటుంది. తాజాగా మరో సారి ఈ క్యూటీ నెట్టింట సందడి చేస్తోంది. అర్హ ఫొటోలు వీడియోలను రెగ్యులర్ గా స్నేహా రెడ్డి షేర్‌ చేస్తూ ఉంటుంది. ఈసారి స్నేహా రెడ్డి షేర్‌ చేసిన అల్లు అర్హ వీడియో ఇంతకు ముందు వీడియోల కంటే మరింత క్యూట్ ఉంటంటూ నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.

అర్హ మరియు స్నేహా రెడ్డిలను ఈ వీడియోలో చూడవచ్చు. అర్హ కు బొట్టు పెడుతున్న స్నేహా.. ఆ తర్వాత తల్లి స్నేహాకు అర్హ చాక్లెట్‌ తిపిస్తున్న ఈ వీడియో పదే పదే చూడాలనిపించేలా ఉంది. అర్హ చూస్తుండగానే పెద్ద పాప అవుతుందంటూ నెటిజన్స్ కొందరు కామెంట్స్‌ చేయగా కొందరు అల్లు అర్జున్ ఎంత అదృష్టవంతుడు ఇలాంటి పాపను కలిగి ఉన్నందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ట్రెడీషనల్ లంగా జాకెట్ లో అర్హ అచ్చ తెలుగు పాప మాదిరిగా అందమైన క్యూట్‌ బేబీగా కనిపిస్తుంది.

అల్లు అర్జున్‌ కూడా అర్హ వీడియోలను మరియు ఫొటోలను రెగ్యులర్ గా తన సోషల్‌ మీడియా అకౌంట్ లో షేర్‌ చేస్తూ ఉంటాడు. అర్హ మరియు అల్లు అర్జున్‌ ల వీడియోలు గతంలో చాలా సార్లు వైరల్‌ అయిన విషయం తెల్సిందే. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా అల్లు అర్జున్‌ ఖచ్చితంగా తన పిల్లలకు కావాల్సినంత సమయంను ఇస్తాడు అనే టాక్ ఉంది. బన్నీ ఫ్యామిలీతో ఎక్కువగా స్పెండ్‌ చేసేందుకు ఇష్టపడుతాడు. ప్రస్తుతం ఈయన పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా లో హీరోయిన్ గా రష్మికా మందన్నా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ఐకాన్ సినిమాను బన్నీ చేస్తాడనే టాక్‌ వినిపిస్తుంది.