Begin typing your search above and press return to search.

వీడియో: `ఫామిలీ మ్యాన్ 2` సెట్లో సామ్ జామ్

By:  Tupaki Desk   |   15 July 2021 4:15 AM GMT
వీడియో: `ఫామిలీ మ్యాన్ 2` సెట్లో సామ్ జామ్
X
ఆన్ లొకేష‌న్ వ‌ర్క్ టెన్ష‌న్ లేకుండా ఎన‌ర్జీ రావాలంటే.. సెట్లో అంత‌మంది మ‌ధ్య‌లో పాజిటివ్ వైబ్స్ పుట్టుకు రావాలంటే ఏం చేయాలి? ఇదిగో స‌మంత చేసిన‌ట్టు చేయాలి. `ఫ్యామిలీ మ్యాన్ 2` సిరీస్ లో ఎల్.టి.టి.యి రెబ‌ల్ రాజీ పాత్ర‌లో న‌ట‌న‌కు గొప్ప ప్ర‌శంస‌లు అందుకున్న స‌మంత అందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ఒక్క సిరీస్ తో సామ్ ఖ్యాతి ఖండాంత‌రాల‌కు వ్యాపించింది. ఇటు సౌత్ తో పాటు అటు బాలీవుడ్ లో త‌న ఇమేజ్ అమాంతం పెరిగింది. సామ్ గొప్ప న‌టి అన్న పేరు తెచ్చుకుంది. మాస్ తీవ్ర‌వాదిగా రెబ‌ల్ గా సమంత అద్భుత ఆహార్యానికి మూల మూల‌ల్లో రిక‌గ్నిష‌న్ ద‌క్కింది. సామ్ పాత్ర‌లో గ్రేషేడ్ స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌ను రాజేసింది. ఫ్యామిలీ మ్యాన్ 2 బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించ‌డం వెన‌క మ‌నోజ్ భాజ్ పాయ్ అద్భుత న‌ట‌న‌తో పాటు పోటాపోటీగా రాజీ పాత్ర‌లో సామ్ న‌ట‌న అంతే పెద్ద ప్ల‌స్ అయ్యింద‌న్న టాక్ వినిపించింది. ఇటీవ‌లి కాలంలో తెలుగు ఆడియెన్ కి విప‌రీతంగా క‌నెక్టయిన సిరీస్ గా `ఫ్యామిలీమ్యాన్` పాపులారిటీ పెంచుకుంది.

ఇక ఈ సిరీస్ లో త‌న‌ పాత్రను పోషించడానికి స‌మంత‌ చాలా వరకు వెళ్ళింది. సెట్లో స‌మంత చిలౌట్ కి తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన ఈ వీడియోనే సాక్ష్యంగా నిలుస్తుంది. షాట్ గ్యాప్ లో పాట‌లు పాడుతూ న‌డుముతో డ్యాన్సాడుతున్న ఫ‌న్నీ వీడియోని స‌మంత షేర్ చేసింది. ఇలాంటి పాజిటివ్ వైబ్స్ తనకు ఎంతో శక్తిని ఇచ్చాయ‌ని సాధ్యమైనంత ఉత్తమంగా న‌టించేందుకు ఉప‌క‌రించాయ‌ని సామ్ చెప్పారు. ఫ్యామిలీ మ్యాన్ 2 కి రాజ్ అండ్ డికె దర్శకత్వం వహించారు. త‌దుప‌రి నెట్ ఫ్లిక్స్ తో స‌మంత భారీ డీల్ కుదుర్చుకున్నార‌ని ఒక క్రేజీ వెబ్ సిరీస్ లో న‌టిస్తార‌ని కూడా టాక్ వినిపిస్తోంది. మ‌రోవైపు తెలుగులో శాకుంత‌లం చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిన‌దే.