Begin typing your search above and press return to search.

వీడియోః రియల్‌ హీరో దోశలు వేశాడు

By:  Tupaki Desk   |   13 April 2021 9:30 AM GMT
వీడియోః రియల్‌ హీరో దోశలు వేశాడు
X
కరోనా విపత్తు సమయంలో దేశ వ్యాప్తంగా ఎంతో మందికి అండగా నిలబడ్డ సినిమా స్టార్‌ ల్లో సోనూసూద్‌ ముందు వరుసలో ఉంటాడు అనడంలో సందేహం లేదు. ఆయన కొన్ని వేల మంది వలస కార్మికులకు అండగా నిలబడ్డాడు. ఇక ఆయన సోషల్‌ మీడియా ద్వారా ఆయన్ను ఎవరు సాయం కావాలని అడిగినా కూడా వెంటనే సాయం చేసేందుకు ముందుకు వచ్చే వాడు. అంతటి గొప్ప మనసున్న వ్యక్తి సోనూసూద్‌. అందుకే ఆయన్ను జనాలు రియల్‌ హీరో అంటూ పిలుస్తున్నారు. అలాంటి రియల్‌ హీరో ప్రస్తుతం సినిమాలతో మరింత బిజీ అయ్యాడు. ఒక వైపు విలన్‌ గా నటిస్తున్నే మరో వైపు రియల్‌ హీరో ఇమేజ్‌ కారణంగా హీరోగా నటించేందుకు ముందుకు వస్తున్నాడు.

తాజాగా ఒక సినిమా షూటింగ్‌ లో పాల్గొన్న సోనూసూద్ షూటింగ్‌ గ్యాప్‌ లో ప్రొడక్షన్‌ వారు ఏర్పాటు చేసిన కిచెన్‌ లో దోశలు వేసి అందరిని ఆశ్చర్యపర్చాడు. సోనూసూద్‌ దోశలు ప్రస్తుతం నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దోశలు వేస్తూ ఉన్న సమయంలో సోనూ సూద్‌ చాలా యాక్టివ్‌ గా కనిపించాడు. అదే సమయంలో ఆయన మాట్లాడుతూ యాక్టర్‌ అవ్వాలంటే దోశలు వేయడం రావాలి. అప్పుడే నిర్మాతకు ఖర్చు తగ్గుతుందనే ఉద్దేశ్యంతో సినిమాల్లో ఎంపిక చేసుకుంటారు. నిర్మాతలకు ఖర్చు తగ్గించే వారికి ఎక్కువ అవకాశాలు వస్తాయంటూ సరదాగా సోనూ సూద్‌ వ్యాఖ్యలు చేశాడు. మొత్తానికి సోనూసూద్‌ కు సినిమాల్లో నటించడం.. సేవ చేయడం మాత్రమే కాకుండా ఇలా దోశలు వేయడం కూడా వచ్చని నిరూపించుకున్నాడు.