Begin typing your search above and press return to search.

ప్రో క‌బ‌డ్డీ కోసం 'RRR' టీమ్ హంగామా

By:  Tupaki Desk   |   23 Dec 2021 6:34 AM GMT
ప్రో క‌బ‌డ్డీ కోసం RRR టీమ్ హంగామా
X
టాలీవుడ్ నుంచి వ‌స్తున్న అత్యంత ప్రెస్టీజియ‌స్ మూవీ `RRR`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీపై ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ వైడ్‌గా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలి సారి క‌లిసి న‌టించిన చిత్ర‌మిది. ప్రీ ఇండిపెండెంట్ కాలం నేప‌థ్యంలో స్వాతంత్య్రం కోసం ఫైట్ చేసిన ఇద్ద‌రు యోధుల క‌థ కావ‌డంతో ఈ సినిమాపై అంద‌రిలోనూ ఆస‌క్తి ఏర్ప‌డింది.

దీన్ని గ్ర‌హించిన రాజ‌మౌళి ఈ సినిమా ప్ర‌చారం కోసం స‌రికొత్త ప్యూహాన్ని ర‌చించి దాన్ని ప‌ర్ఫెక్ట్ గా అమ‌లు చేయ‌డం మొద‌లు పెట్టారు. ఇప్ప‌టికే ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నారు. సినిమాకు అంత‌ర్జాతీయ స్థాయిలో క్రేజ్ ని తీసుకురావాల‌ని రాజ‌మౌళి విశ్వ ప్ర‌య‌త్నాలే చేస్తున్నారు. ఇందు కోసం ముంబైలో ఇటీవ‌ల ప్రీ రిలీజ్ వేడుక‌ని భారీగా ఖ‌ర్చు చేసి భారీ హంగామా చేశారు. స‌ల్మాన్ ఖాన్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఉత్త‌రాదిలో సినిమాకు కావాల్సినంత ప‌బ్లిసిటీని రాబ‌ట్టుకున్నారు.

ఇక దేశ వ్యాప్తంగా వున్న అనేక భాష‌ల‌కు సంబంధించిన ప్రేక్ష‌కుల్ని కూడా ఎట్రాక్ట్ చేసి సినిమాపై అటెన్ష‌న్ ని క్రియేట్ చేయాల‌ని రాజ‌మౌళి చేస్తున్న ప్ర‌య‌త్నాలు సినీ మేక‌ర్ ల‌ని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తున్నాయి. సినిమా ప్రచారం కోసం కాలేజీ వేదిక‌ల‌తో పాటు ప్రీ షోని అనువుగా వాడుకుంటూ వ‌స్తున్న రాజ‌మౌళి క‌పిల్ శ‌ర్మ షో తో పాటు బాలీవుడ్ మీడియా మొత్తాన్నిత‌న `RRR` ప్ర‌మోష‌న్ కోసం వాడేశారు.

ఇక ప్రాంతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో ఈ సినిమాకి క్రేజ్ ని తీసుకొచ్చే ప‌నిలో ప‌డ్డారాయ‌న‌. ఇందు కోసం ప్రో క‌బ‌డ్డీ వేదిక‌ల‌పై కూడా ఈ సినిమాని ప్ర‌మోట్ చేయ‌డం మొద‌లుపెట్టారు. నిన్న సాయంత్రం ప్రో క‌బ‌డ్డీ ప్రారంభ వేడుక‌ల్లో రాజ‌మౌళి,రామ్ చ‌ర‌ణ్ ,ఎన్టీఆర్ పాల్గొని హ‌ల్ చ‌ల్ చేశారు. అంతే కాకుండా ప్ర‌తీ స్పోర్ట్స్ ఛాన‌ల్ లో ప్రోక‌బ‌డ్డీ గురించి చెబుతూనే `RRR` గురించి ప్ర‌చారం చేయ‌డం ప‌లువురు ట్రేడ్ వ‌ర్గాలు విస్మ‌యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

సినిమాని స్పోర్ట్స్ ఛాన‌ల్స్ లో కూడా ఇలా ప్ర‌చారం చేసుకోవ‌చ్చా అని ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా స్టార్ స్పోర్ట్స్ తెలుగు వేదిక పై ప్రో క‌బ‌డ్డీ లీగ్ (పీకెఎల్‌) ఎనిమిద‌వ సీజ‌న్ ని `RRR` టీమ్ బుధ‌వారం ప్రారంభించింది. ఈ సంద‌ర్భంగా స్టార్ స్పోర్ట్స్ తెలుగు ట్విట్ట‌ర్ వేదిక‌గా షేర్ చేసిన వీడియో ఆక‌ట్టుకుంటోంది. `ప‌వ‌ర్ ఫుల్ గేమ్ కు ఇంత‌కంటే ప‌దునైన ప్రారంభం ఏముంటుంది` అంటూ ఈ వీడియోని షేర్ చేసింది.

`క‌బ‌డీ క‌బ‌డీక‌బ‌డీ అమ్మ‌తోడు మ్యాట్ పై ఆట అద్ద‌రిపోద్ది.. అని ఎన్టీఆర్ అన‌గా...ఈ ఆటా నాదే..ఈ వేటా నాదే.. అని రామ్ చ‌ర‌ణ్ అన‌డంతో హ‌లో హ‌లో..ఏంటీ నేను యాక్ష‌న్ చెప్ప‌కుండా మీరిద్ద‌రూ క‌బ‌డీ ఆడేస్తున్నారు` అని రాజ‌మౌళి మ‌ధ్య‌లోకి వ‌చ్చేయ‌డం..హాలో ఎక్స్క్యూజ్ మీ ఇది మీ సెట్టుకాదు అని ఎన్టీఆర్ అన‌డం న‌వ్వులు పూయిస్తోంది.

ఈ ప్రచారంతో `RRR`పై దేశ వ్యాప్తంగా వున్న అంద‌రి దృష్టి ప‌డింది. రాజ‌మౌళి ప్లాన్ తో ఓపెనింగ్స్ కేక‌లే అంటున్నారంతా. స్వాతంత్య్ర స‌మ‌రంలో హీరోలుగా నిలిచిన అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీం లు క‌లిసి ఫైట్ చేస్తే ఎలా వుంటుంద‌నే ఫాంట‌సీ అంశాల‌ని జోడించి రాజ‌మౌళి చేసిన ఈ ప్ర‌యోగం ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుంద‌న్న‌ది తెలియాలంటే జ‌న‌వ‌రి 7 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.