Begin typing your search above and press return to search.

వీడియో : హాట్ అందాలతో చాలెంజ్ విసిరిన బుట్టబొమ్మ

By:  Tupaki Desk   |   16 Feb 2022 4:57 AM GMT
వీడియో : హాట్ అందాలతో చాలెంజ్ విసిరిన బుట్టబొమ్మ
X
ప్రస్తుతం యూట్యూబ్‌ లో దేశ వ్యాప్తంగా ట్రెండ్‌ అవుతున్న విజయ్‌ బీస్ట్‌ సినిమా అరబిక్‌ కుత్తు ను మరో రేంజ్ కు తీసుకు వెళ్లేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఒక డాన్స్ బిట్‌ ను రీ క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో షేర్ చేయండి అంటూ ఛాలెంజ్ ను మొదలు పెట్టారు. పూజా హెగ్డే మొదటగా ఆ ఛాలెంజ్ ను విసురుతూ వీడియోను చేసి ఇన్ స్టా గ్రామ్‌ లో షేర్ చేసింది.

పాటలో విజయ్‌ కి ఏమాత్రం తగ్గకుండా పూజా హెగ్డే డాన్స్ తో దుమ్ము రేపింది. అద్బుతమైన అందాలతో పాటు పాటలో ఆమె ఆకట్టుకునే స్టెప్పులను చాలా సింపుల్‌ గా చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. లావిష్‌ సెట్ లో సహజంగా అయితే క్యారెక్టర్స్ అంతగా హైలైట్‌ అవ్వవనే టాక్‌ ఉంటుంది. కాని ఆ భారీ సెట్‌ లో విజయ్ మరియు పూజాలు చేసిన స్టెప్స్ ముఖ్యంగా పూజా అందాల విందు గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది.

డాన్స్ తో అరబిక్‌ కుత్తు స్థాయిని మరింతగా పెంచిన పూజా హెగ్డే ఒక హిప్‌ స్టెప్పును మీరు చేయండి అంటూ చాలెంజ్ విసిరింది. సోషల్‌ మీడియాలో ఇప్పటికే ట్రెండ్‌ అవుతున్న ఈ పాట కొత్త చాలెంజ్‌ తో మరింతగా మారు మ్రోగడం ఖాయం. హాట్‌ అందాలతో నడి సంద్రంలో ఒక బోటుపై పూజా హెగ్డే అబిత్తి అబిబూ అంటూ అందాలు ఆరబోస్తూ చేసిన డాన్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మరోసారి పూజా హెగ్డే తన అందాల విందుకు జనాలు ఫిదా అవుతున్నారు. క్లీ వేజ్ షో తో పాటు నడుము అందాలను ఎక్స్‌ పోజ్ చేస్తూ ఈ అమ్మడు చేసిన డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవ్వడం మాత్రమే కాకుండా ఈమె చేసిన ఛాలెంజ్ జనాల్లో బాగా పాపులర్ అవ్వడం ఖాయం అనిపిస్తుంది. దేశవ్యాప్తంగా అరబిక్ కుత్తు మారు మ్రోగుతున్న ఈ సమయంలో ఈ ఛాలెంజ్ లో ఎంత మంది పూజా ను మించి డాన్స్ చేస్తారనేది చూడాలి.

నెల్సన్ దర్శకత్వంలో రూపొందుతున్న బీస్ట్‌ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కొలవెరిడీ తర్వాత ఆ తరహా పాటగా అరబిక్ కుత్తు కు పేరు దక్కింది. ఈ పాటకు ప్రముఖ యంగ్‌ హీరో శివ కార్తికేయన్ లిరిక్స్ రావడం మరింత ఆకర్షణగా నిలిచింది. ఈ పాట వాలెంటైన్స్ డే సందర్బంగా విడుదల చేశారు. ఈ సమ్మర్‌ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

విజయ్ బీస్ట్‌ సినిమా తమిళంలోనే కాకుండా తెలుగు లో కూడా ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే పూజా హెగ్డేకు తెలుగు లో మంచి ఫేమ్‌ ఉంది.. అంతే కాకుండా దిల్‌ రాజు ఈ సినిమా ను తెలుగు లో విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి. కనుక ఖచ్చితంగా విజయ్ కి ఇది తెలుగు లో టాప్‌ చిత్రంగా నిలవడం ఖాయం. బీస్ట్‌ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ ఒక తెలుగు సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే.