Begin typing your search above and press return to search.
వీడియో: ర్యాంప్ షోకి వెళ్లే ముందు బుట్టబొమ్మ ప్రిపరేషన్
By: Tupaki Desk | 27 March 2021 7:23 PM ISTబుట్టబొమ్మ పూజా హెగ్డే ఓవైపు టాలీవుడ్ సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు బాలీవుడ్ లోనూ కెరీర్ ని పరుగులు పెట్టిస్తోంది. హైదరాబాద్ టు ముంబై నిరంతర ప్రయాణాలతో విమానాశ్రయాల్లో పూజా హల్చల్ చూస్తున్నదే. హద్దులు చెరిపేసి ఇరు పరిశ్రమల్లో స్టార్ డమ్ ని ఆస్వాధిస్తున్న ఈ బ్యూటీ వరస ర్యాంప్ షోలతోనూ అదరగొడుతోంది.
ఇటీవల లాక్మే ఫ్యాషన్ వీక్ లో పూజా షో స్టాపర్ గా నిలిచింది. ఈ ఫ్యాషన్ వీక్ కోసం పూజా ఎంపిక చేసుకున్న డిజైనర్ వేర్ బుట్టబొమ్మ ఎలివేషన్ నే తెచ్చింది. వైట్ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ లో ఎంబ్రాయిడరీ క్రిస్టల్స్ మెరుపులతో అద్భుతమైన లెహంగాలో మెరుపులు మెరిపించింది పూజా. ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి.
తాజాగా ర్యాంప్ షోకి ముందే బ్యాక్ స్టేజ్ లో ఎలా ఉంటుందో ఒక వీడియోని పూజా హెగ్డే షేర్ చేశారు. ర్యాంప్ పైకి వెళ్లే ముందే మూడ్ స్వింగ్ లోకి వచ్చింది! అంటూ వ్యాఖ్యను జోడించారు. వరుణ్ చక్కిలమ్ ఈ వీడియోని షూట్ చేశారు. ప్రస్తుతం పూజా అభిమానుల్లో వైరల్ గా మారింది ఈ స్పెషల్ వీడియో.
రాధేశ్యామ్ చిత్రీకరణ పూర్తి చేసిన పూజా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రీకరణలో పాల్గొంటోంది. అలాగే రణవీర్ సింగ్ సరసన సిర్కస్ చిత్రీకరణలోనూ పాల్గొంటోంది. ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తుండగా టీసిరీస్-రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సల్మాన్ భాయ్ సరసన `కబీ ఈద్ కబీ కబీ దీపావళి` అనే భారీ చిత్రంలో నటించనుంది.