Begin typing your search above and press return to search.

వీడియోః ఇంకేం ఇంకేం కావాలి అంటూ హృదయాలను కొల్లగొడుతున్న పాయల్‌

By:  Tupaki Desk   |   25 March 2021 3:10 AM GMT
వీడియోః ఇంకేం ఇంకేం కావాలి అంటూ హృదయాలను కొల్లగొడుతున్న పాయల్‌
X
ఆర్ ఎక్స్‌ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువ అయిన ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌ పూత్ సినిమాల్లో కాస్త తక్కువ కనిపించినా కూడా సోషల్‌ మీడియాలో మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ అమ్మడు తెలుగులో ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఏంటీ అంటే ఠక్కున చెప్పడానికి ఏమీ లేవు. కాని సోషల్‌ మీడియాలో ఈమె షేర్‌ చేస్తున్న వీడియోలు మరియు ఫొటోలతో ఎప్పుడు కూడా టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా ఉంటుంది. ఎప్పుడు క్లీవేజ్ షో.. థైస్‌ ఎక్స్‌ పోజ్‌ నాభి అందాలతో యువతను ఉర్రూతలూగించే ముద్దుగుమ్మ ఈసారి ఒక క్యూట్‌ వీడియోతో హృదయాలను కొల్లగొట్టింది.

విజయ్‌ దేవరకొండ మరియు రష్మిక మందన్నా కలిసి నటించిన గీత గోవిందం సినిమాలోని ఇంకేం ఇంకే కావాలే అంటూ సాగే పాటకు పాయల్‌ రీల్స్ వీడియో చేసింది. ఆ వీడియోలో పాయల్‌ ఎక్స్‌ ప్రెషన్స్‌ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. పద్దతైన పట్టు చీరలో పాయల్‌ ఉన్నట్లుగా అనిపిస్తుంది. చేతికి పెద్ద గాజులు మరియు నుదుట పెద్ద పాపడ బిల్లను ధరించిన పాయల్ రాజ్‌ పూత్‌ చాలా ఆకర్షణీయంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలను ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఇంత అందంగా ఇంత క్యూట్‌ గా ఎలా ఉంటారు మేడం అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.