Begin typing your search above and press return to search.

వీడియో: విశ్వ‌క్ బుల్లోడితో ప‌డుచుపిల్ల‌ ప‌రాచికం

By:  Tupaki Desk   |   16 Feb 2022 4:22 AM GMT
వీడియో: విశ్వ‌క్ బుల్లోడితో ప‌డుచుపిల్ల‌ ప‌రాచికం
X
బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో యువ‌హీరో విశ్వ‌క్ సేన్ కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. వెళ్లిపోమాకే- ఈ న‌గ‌రానికి ఏమైంది?- ఫ‌ల‌క్ నుమా దాస్- హిట్ - పాగ‌ల్ అంటూ వ‌రుస‌గా అర‌డ‌జ‌ను సినిమాలు చేసేశాడు. హైద‌రాబాదీ టైపిక‌ల్ యాస‌తో ఫ‌ల‌క్ నుమా దాస్ గా ప్ర‌జ‌ల్లో రిజిస్ట‌ర్ అయ్యాడు. ఇప్పుడు మ‌రో సినిమాతో అభిమానుల ముందుకు వ‌స్తున్నాడు.

`అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం` అనేది ఈ సినిమా టైటిల్. విశ్వ‌క్ స‌ర‌స‌న రుక్షార్ థిల్లాన్ నాయిక‌గా న‌టిస్తోంది. విద్యా సాగర్ చిన్నా దర్శకుడు. టైటిల్ తోనే ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో ప్ర‌మోష‌న్స్ లో వేగం పెంచాడు. ``ఇంకా రెండు రోజులే ఉంది.. పిల్లని వెతికి పెట్టండి.. లేదా కనీసం పడేయటానికి టిప్స్ అయినా ఇవ్వండి`` అంటూ ఇటీవ‌ల కోరిన సంగ‌తి తెలిసిందే. బ‌యోడేటాతో రెక్వ‌స్ట్ కి దిగాడు విశ్వ‌క్. `హెల్ప్ అల్లం.. ఫైండ్ పెళ్ళాం` హ్యాష్ ట్యాగ్ ఆక‌ట్టుకుంది.

తాజాగా ఈ మూవీ నుంచి ఓరోరి సిన్న‌వాడా ! అంటూ సాగే టీజింగ్ సాంగ్ విడుద‌లైంది. అప్పుడే సోగ్గాడిలా స్టైలిష్ గా ట‌క్కు టిక్కు చేసుకుని రెబాన్ క‌ళ్ల‌ద్దాలు ధ‌రించి బండి నుంచి దిగుతున్నాడు పెళ్లికొడుకు విశ్వ‌క్. అప్ప‌టికే అత‌డికి వెల్ కం చెబుతున్న పెళ్లి కుమార్తె రుక్షార్ అద్భుత‌మైన హావ‌భావాల‌తో సిన్న‌వాడికి వెల్ కం చెబుతున్న తీరు వ్వావ్ అనిపిస్తుంది. పాట కంపోజిష‌న్ గానం ప్ర‌తిదీ ఎంతో ఆక‌ట్టుకుంటున్నాయి. ఇక క్లాసీ నేరేష‌న్ తో కొరియోగ్ర‌ఫీ కూడా ఎంతో ఆక‌ట్టుకుంది.

అన‌న్య - గౌత‌మ్ ఈ పాట‌ను పాడారు. ఓరోరి సిన్న‌వాడా.. సాంగ్ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పాటలో హీరోయిన్ రుస్కర్ ధిల్లాన్ ట్రెండీ లుక్ లో కనిపించి తన (కాబోయే) జీవిత భాగస్వామి గురించి పాడుతూ అతనికి స్వాగతం పలికిన తీరు ఆక‌ట్టుకుంది. జై క్రిష్ జానపద సంగీతాన్ని అందించగా.. సనాపతి భరద్వాజ్ పాత్రుడు ఆసక్తికరమైన లైన్స్ అందించారు. అనన్య భట్ - గౌతమ్ భరద్వాజ్ అందించిన ప్రదర్శన మరియు దాదాపు నాలుగు నిమిషాల పాటు నడిచే వీడియో అంతటా చక్కని సన్నివేశాలు సరైన భావాన్ని క‌లిగిస్తాయి.

విశ్వక్ సేన్ పోషించిన అర్జున్ కుమార్ అల్లం .. రుస్కర్ ధిల్లాన్ పాత్రలో పసుపులేటి మాధవి గురించిన స్టోరీ ఇది. పెళ్లి తంతులో విచిత్ర‌ మలుపుల నేప‌థ్యంలోని క‌థాంశ‌మిది. విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహిస్తున్నారు. బాపినీడు B - సుధీర్ ఈదర నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ సమర్పిస్తున్నారు.

కథ- స్క్రీన్‌ప్లే -సంభాషణలు.. రాజు వారు రాణి వారు ఫేమ్ రవికిరణ్ కోలా అందించారు. జయ్ క్రిష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి కార్తీక్ పలని సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఎస్.వి.సి.సి డిజిటల్ బ్యానర్ పై ఈ సినిమా ను నిర్మిస్తున్నారు.