Begin typing your search above and press return to search.

వీడియో : ఆటో డ్రైవర్‌ అవతారం ఎత్తిన స్టార్‌ హీరో

By:  Tupaki Desk   |   15 April 2022 7:36 AM GMT
వీడియో : ఆటో డ్రైవర్‌ అవతారం ఎత్తిన స్టార్‌ హీరో
X
తమిళ స్టార్‌ హీరో శింబు ప్రస్తుతం హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకు పోతున్నాడు. ఆమద్య కాస్త డల్ అయిన శింబు మళ్లీ పుంజుకున్నాడు. హీరోగా ఆయన వరుసగా సినిమాలు చేస్తూ.. సక్సెస్ లు దక్కించుకుంటూ మరో వైపు బిగ్ బాస్ కు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. కమల్‌ హాసన్ స్థానంను భర్తీ చేసిన శింబు ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

కమల్‌ హాసన్‌ వంటి బిగ్గెస్ట్‌ స్టార్‌ హోస్ట్‌ గా బిగ్ బాస్ ను నడిపించినప్పుడు.. ఆయన స్థానంలో ఏ స్టార్‌ వచ్చినా కూడా ఖచ్చితంగా విమర్శలు వచ్చేవి. కాని ఇప్పుడు శింబు చేస్తున్న హడావుడికి ఇతర హీరోలు అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శింబు ను ఈ స్థాయిలో ఎవరు ఊహించుకోలేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

బిగ్‌ బాస్ కు కమల్‌ హాసన్‌ స్థాయిలో కాకున్నా కూడా ఖచ్చితంగా బాగానే హోస్టింగ్‌ చేస్తున్నాడు అంటూ కామెంట్స్ ను దక్కించుకుంటున్నాడు. హీరోగా ఈమద్య ఎలా అయితే సక్సెస్ ను దక్కించుకున్నాడో అలాగే బిగ్ బాస్ తో కూడా అలరిస్తున్నాడు అంటూ టాక్ ను దక్కించుకుని శింబు మరింతగా స్టార్‌ డమ్‌ ను దక్కించుకున్నాడు.

ఇక తాజాగా శింబు కు సంబంధించిన ఒక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆ వీడియో లో శింబు ఆటో డ్రైవర్‌ గా కనిపించాడు.

ఆటో డ్రైవర్ గా శింబు కనిపించబోతున్న సినిమా నా లేదంటే మరేదైనా యాడ్‌ అయ్యి ఉంటుందా అనేది ఫ్యాన్స్ లో చర్చ జరుగుతోంది.

శింబు ఈమద్య కాలంలో ఏం చేసినా కూడా సక్సెస్ లు దక్కించుకున్నాడు. కనుక శింబు ఆటో డ్రైవర్ గా కూడా మెప్పిస్తాడేమో అంటూ అంతా ఆసక్తిగా చూస్తున్నారు. శింబు అభిమానులు ప్రస్తుతం ఆటో డ్రైవర్‌ వీడియో గురించి సోషల్‌ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు.