Begin typing your search above and press return to search.

వీడియో: డ్యాన్సుల్లో మెరుపుతీగ ఈ మ‌నోహ‌రి

By:  Tupaki Desk   |   25 May 2021 6:30 AM GMT
వీడియో: డ్యాన్సుల్లో మెరుపుతీగ ఈ మ‌నోహ‌రి
X
ఇంటర్నెట్ డ్యాన్స్ ఛాలెంజ్ తో అభిమానుల్ని టెంప్ట్ చేస్తోంది నోరా ఫతేహి. ఇన్ స్టాలో ఛాలెంజ్ విసిరిన నోరా త‌న‌ అభిమానులు చేరాలని కోరారు. ఎన‌ర్జిటిక్ స్టెప్పుల‌తో అసాధార‌ణ‌ కదలికలకు ప్రసిద్ధి చెందిన కెనడియన్ నర్తకి నోరా ఫతేహి త‌న‌వైన‌ డ్యాన్స్ పోకడలతో అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

కొరియోగ్రాఫర్ రజిత్ దేవ్ తో నోరా కొత్త ఛాలెంజ్ లో పాల్గొన్నారు. నోరా ఫతేహి తాజా డ్యాన్స్ ఛాలెంజ్ వీడియో ఆమె అభిమానులకు పంపిన సందేశం ఆస‌క్తిక‌రం. ప‌సుపు రంగు షార్ట్.. వైట్ టాప్ తో టాప్ లేపేసింది నోరా. క‌రీబ్ సాంగ్ కి డ్యాన్స్ ల్లో వీరిద్దరి కెమిస్ట్రీ అభిమానులకు వెల్ ట్రీట్ అనే చెప్పాలి.

ఒరిజినల్ మ్యూజిక్ వీడియోలో కనిపించిన రజిత్ దేవ్ కు పాట హుక్ స్టెప్ నేర్పించింది కూడా నోరానే కావ‌డం విశేషం. ఇంట్లో నిర్భంధంలో ఉన్న‌వారంతా యాక్టివ్ గా ఉండటానికి నోరాతో ఛాలెంజ్ లో పాల్గొనాల‌ని అభిమానులను ప్రోత్సహించింది.

కరీబ్ మ్యూజిక్ వీడియోలో కనిపించిన దివ్య అగర్వాల్ ఈ పాటకు సహకరించినందుకు నోరా ఫ‌తేహికి కృతజ్ఞతలు తెలిపారు. వీరిద్దరి మధ్య అభిమానులు సరదాగా కెమిస్ట్రీని ఆస్వాధిస్తూ వ్యాఖ్యల‌ విభాగం ఫైర్ హార్ట్ ఎమోజీలను షేర్ చేశారు. ఒక అభిమాని వీడియో హాట్ అని వ్యాఖ్యానించగా, .. మరొక అభిమాని తమ `అభిమాన జంట` అని వ్యాఖ్యానించారు.

28 ఏళ్ల నోరా 2014 లో `రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్` చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. పలు దక్షిణ భారత సినిమాల్లో ఐట‌మ్ పాట‌ల్లో న‌ర్తించిన తరువాత నోరా తన డ్యాన్స్ నైపుణ్యానికి గుర్తింపు పొందింది. దిల్బార్ మ్యూజిక్ వీడియోలో కనిపించిన తరువాత ఆమె బాలీవుడ్ లో బిగ్ బ్రేక్ సాధించింది. 24 గంటలలోపు 20 మిలియన్లను దాటిన అత్యంత వేగవంతమైన భారతీయ మ్యూజిక్ వీడియోగా నిలిచింది.

నాచ్ మేరీ రాణి- చోర్ డెంగే వంటి సూప‌ర్ హిట్ మ్యూజిక్ వీడియోలలో కనిపించింది. నోరా ఫతేహి సినిమాలు స్ట్రీట్ డాన్సర్ 3 డి విజ‌యం సాధించంది.