Begin typing your search above and press return to search.

వీడియో: తీగ‌లోకి క‌రెంట్ ప్ర‌వ‌హించిన‌ట్టు..!

By:  Tupaki Desk   |   1 July 2021 7:30 AM GMT
వీడియో: తీగ‌లోకి క‌రెంట్ ప్ర‌వ‌హించిన‌ట్టు..!
X
న‌రాల్లోకి క‌రెంటు ప్ర‌వ‌హించిన‌ట్టు.. బాడీలో స్ప్రింగు ప్ర‌వేశించిన‌ట్టు.. ఈ అమ్మ‌డి డ్యాన్స్ మూవ్స్ ని చూస్తున్నారు క‌దా! .. అస‌లు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని ఈ బ్యూటీ ఇప్ప‌టికే ఎన్నో వైవిధ్య‌మైన డ్యాన్స్ మూవ్ మెంట్స్ ని సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసింది. అవ‌న్నీ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా దూసుకెళ్లాయి.

డ్యాన్స్ ఫ్లోర్ పై నాగినిలా చెల‌రేగ‌డంలో నోరా ఫ‌తేహి పోటీప‌డ‌డం ఇత‌రుల‌కు అంత సులువేమీ కాదు. త‌న‌దైన స‌మ్మోహ‌న రూపం.. స్క్రింగును త‌ల‌పించే శ‌రీర క‌ద‌లిక‌ల‌తో మ‌తులు చెడ‌గొడుతుంది. స‌ల్సా స‌హా వెస్ట్ర‌న్ డ్యాన్సుల్లో నోరాను కొట్టేవాళ్లే లేరు. తాజాగా 29 ఏళ్ల నోరా తన సరికొత్త వీడియోతో ఇంటర్నెట్ లో మంట పెట్టింది. ప్ర‌ఖ్యాత‌ సంగీతకారుడు డ్రేక్ పాట `వన్` కి డాన్స్ లాడింది. నోరా ప్ర‌త్యేకించి పింక్ బ్రాలెట్ డెనిమ్ షార్ట్ ధ‌రించి హీట్ పెంచింది. `సమ్మ‌ర్ టైమ్` గడపడానికి డ్యాన్స్ ఉత్త‌మ మార్గాల్లో ఒకటి అని శీర్షికలో నోరా వెల్లడించారు.

కేవ‌లం డ్యాన్స్ వీడియోలు మాత్ర‌మే కాదు.. నోరా ఫతేహి ర‌క‌ర‌కాల‌ సరదా వీడియోలను ఇన్ స్టాలో పంచుకుంటుంది. అవ‌న్నీ వైర‌ల్ గా మారుతున్నాయి. నోరా ఓవైపు డ్యాన్స్ రియాలిటీ షోల‌కు జ‌డ్జిగా ప‌ని చేస్తూనే మ‌రోవైపు భారీ చిత్రాల్లో స్పెష‌ల్ రోల్స్ చేస్తోంది. హిస్టారిక‌ల్ మూవీ భుజ్ - ది ప్రైడ్ లోనూ నోరా న‌టిస్తోంది.