Begin typing your search above and press return to search.

వీడియో: బన్నీ క్రూరమైన పుష్పరాజ్ గా మారిన వైనం..!

By:  Tupaki Desk   |   9 Feb 2022 12:30 PM GMT
వీడియో: బన్నీ క్రూరమైన పుష్పరాజ్ గా మారిన వైనం..!
X
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ - రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ''పుష్ప: ది రైజ్''. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి సంచలన విజయం నమోదు చేసింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో పుష్పరాజ్‌ అనే ఊర మాస్ పాత్రలో కనిపించారు బన్నీ. అలాంటి సంక్లిష్టమైన పాత్రలో జీవించారని సినీ అభిమానులతో పాటుగా సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపించారు.

అల్లు అర్జున్ ఇందులో కూలీగా, లారీ డ్రైవర్ గా స్మగ్లర్‌ గా మూడు కోణాల్లో కనిపించారు. అయితే పుష్పరాజ్‌ గా తనను తాను మలచుకోడానికి బన్నీ తీవ్రంగా శ్రమించినట్లు తెలుస్తోంది. తాజాగా 'పుష్ప' టీం స్టైలిష్ స్టార్ మేకోవర్ గురించి తెలియజేస్తూ 'మీకు తెలిసిన ఫైర్.. మీకు తెలియని ట్రాన్స్ఫర్మేషన్' అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. 'ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రూరమైన పుష్పరాజ్ గా మేకోవర్ అవడాన్ని చూడండి' అని క్యాప్సన్ పెట్టారు.

అల్లు అర్జున్ పుష్పరాజ్‌ పాత్రకి తగ్గట్టుగా మేకప్ వేసుకోవడానికి అంకితభావంతో తీవ్రంగా శ్రమించాడని ఈ వీడియో చూస్తే అర్థం అవుతోంది. డీ గ్లామర్ అవతార్ లో రా అండ్ రస్టిక్ గా కనిపించడం కోసం ఎంతో నిబద్ధతో ఉన్నారని తెలుస్తోంది. నిజ జీవితంలోని ఒక రోజువారీ కూలీగా కనిపించడానికి కొంత బరువు కూడా పెరిగారు. అలానే మేకప్ కోసమే డైలీ కొన్ని గంటల సమయం కేటాయించారు. మేకప్‌ వేయడానికి రెండు గంటలు పడితే.. దాన్ని తొలగించడానికి అర గంటపైనే పట్టేదని 'పుష్ప' మేకర్స్ ఆ మధ్య తెలిపారు.

అంతేకాదు చిత్తూరు యాసలో డైలాగ్స్ చెప్పడానికి స్పెషల్ గా ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. నిత్యం ఆ క్యారెక్టర్‌ లో ఉంటూ, మ్యానరిజమ్స్‌ ని పాటిస్తూ ఏడాదికి పైగా కష్టపడ్డారని తెలుస్తోంది. అడవుల్లో స్మగ్లింగ్ చేసే క్లిష్టమైన పుష్పరాజ్ పాత్రను ఛాలెంజింగ్ గా తీసుకొని.. రెండేళ్ల పాటు షూటింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అల్లు అర్జున్ అంతలా కష్టపడ్డారు కాబట్టే ఇప్పుడు ఆయన పాత్రకు అలాంటి ప్రశంసలు దక్కుతున్నాయని చెప్పవచ్చు.

కాగా, 'పుష్ప' సినిమాలో కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్పరాజ్.. స్మగ్లింగ్ సిండికేట్ ను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనే చూపించారు. ఫస్ట్ పార్ట్ హిట్ అవడంతో రెండో భాగంపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప: ది రూల్' సినిమా కోసం అల్లు అర్జున్ రెడీ అవుతున్నారు. మొదటి భాగానికి మించి ఉండేలా దీన్ని ప్లాన్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది.