Begin typing your search above and press return to search.

వీడియో : పుష్ప కోసం బన్నీ డబ్బింగ్‌

By:  Tupaki Desk   |   21 Nov 2021 3:30 PM GMT
వీడియో : పుష్ప కోసం బన్నీ డబ్బింగ్‌
X
అల్లు అర్జున్‌.. సుకుమార్ ల కాంబోలో రూపొందుతున్న పుష్ప సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే ఐటెం సాంగ్ ను సమంతతో చేయబోతున్నట్లుగా ప్రకటించిన మేకర్స్‌ ఆ పాట చిత్రీకరణ పూర్తి చేశారా.. లేదంటే ముందు ముందు షూట్ చేయబోతున్నారా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే కొందరు తమ తమ పాత్రలకు డబ్బింగ్ పూర్తి చేయగా తాజాగా అల్లు అర్జున్‌ తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పేందుకు డబ్బింగ్‌ స్టూడియోకు వెళ్లాడు. ఆదివారం అయినా కూడా అల్లు అర్జున్‌ డబ్బింగ్‌ స్టూడియోకు వెళ్లి తన పాత్రకు డబ్బింగ్‌ ను చెప్పాడు.

పుష్ప రాజ్ వచ్చి డబ్బింగ్‌ చెప్పిన వీడియోను చిత్ర యూనిట్ సభ్యులు షేర్‌ చేశారు. వీడియోలో ఇంకా బన్నీ పుష్ప లుక్ లోనే అంటే గడ్డం.. జుట్టులోనే కనిపిస్తున్నాడు. కనుక షూటింగ్ ఇంకా పూర్తి చేయలేదేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి పుష్ప రాజ్ డబ్బింగ్‌ పూర్తి చేయడం జరిగింది. ఇక మిగిలిన పాత్రలకు కూడా ఈ నెల లోనే డబ్బింగ్‌ పూర్తి చేస్తారు. డిసెంబర్‌ మొదటి వారంకు సినిమా ఫస్ట్‌ కాపీ రెడీ అవ్వడంతో పాటు సెన్సార్ కు కూడా వెళ్లబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

డిసెంబర్ 17న భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ సినిమా లో బన్నీకి జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్‌ గా నటించింది. ఇక పుష్ప రాజ్‌ తో ఢీ కొట్టబోతున్న విలన్స్ పాత్రల్లో ఫాహద్ ఫాజిల్ మరియు సునీల్‌ లు కనిపించబోతున్నారు. అనసూయ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా స మాచారం అందుతోంది. ఈ సినిమా పూర్తిగా ఎర్ర చందనం స్మగ్లింగ్ మరియు అడవిలో పోరాటలతో సాగుతుందని అంటున్నారు. ఇదే సమయంలో సినిమాలో రష్మిక మరియు బన్నీల మద్య ఉండే సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయని అంటున్నారు. సుకుమార్ ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించాడు. పాన్ ఇండియా రేంజ్ లో భారీగా విడుదల కాబోతున్న ఈ సినిమాతో బన్నీ ఆల్ టైమ్‌ రికార్డ్‌ ను సొంతం చేసుకోబోతున్నట్లుగా అభిమానులు ధీమాతో ఉన్నారు.