Begin typing your search above and press return to search.

వీడియో: డెబ్యూ కాక ముందే పాప చాకిరేవు పెట్టేస్తోందిగా!

By:  Tupaki Desk   |   7 Feb 2021 4:00 PM IST
వీడియో: డెబ్యూ కాక ముందే పాప చాకిరేవు పెట్టేస్తోందిగా!
X
ఇంకా డెబ్యూ సినిమాని ప్ర‌క‌టించనే ‌లేదు. అప్పుడే ఆ లెవ‌ల్లో రెచ్చిపోతోంది. ఇన్ స్టాని ఇలా ప‌బ్లిక్ చేసిందో లేదో అలా పీక్ లో రెచ్చిపోతోంది. కుర్ర‌బ్యూటీ వ‌రుస ఫోటోలు వీడియోల‌తో దుమారం రేపుతోంది. ఇంత‌కీ ఎవ‌రీ అమ్మ‌డు? అన్న‌ది ఆరా తీస్తే..

పేరు షాన‌య క‌పూర్. షారూక్ కుమార్తె సుహానాకి.. చుంకీ పాండే న‌ట‌వార‌సురాలు అన‌న్య పాండేకి క్లోజ్ ఫ్రెండ్. క‌రీనా-సోన‌మ్ ల చుట్టం సంజ‌య్ క‌పూర్ కి గారాల‌ డాట‌ర్. త్వ‌ర‌లోనే క‌థానాయిక‌గా పరిచ‌యం కానుంది. అందుకే సోష‌ల్ మీడియాల్లో య‌మ స్పీడ్ మీద ఉంది. ఇక ఇన్ స్టాలో అయితే అదిరిపోయే వీడియోల‌తో చెమ‌ట‌లు ప‌ట్టించేస్తోంది.

తాజాగా షానయ కపూర్ ఇన్ ‌స్టాగ్రామ్ ‌లో అదిరిపోయే డ్యాన్సింగ్ వీడియోని షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. వైట్ క్రాప్ టాప్ స్కర్ట్ ధరించిన షానయ తన తాజా డ్యాన్స్ సెషన్ కోసం మెలానీ మార్టినెజ్ ప్లే డేట్ పాటను ఎంచుకుంది. వ‌య్యారంగా అలా న‌డుము ఊపుడుతో బెల్లీ డ్యాన్స్ ని అద‌ర‌గొట్టింది.

షానయ వీడియోకి సుహానా ఖాన్ కనెక్షన్ కూడా ఉంది. షాన‌య‌.. తన క్యాప్షన్ లో ఆ సీక్రెట్ చెప్పేసింది. ``సుహానా ఖాన్... మీ ప‌రికిణీ దొంగిలించడానికి నన్ను అనుమతించినందుకు ధన్యవాదాలు`` అని షానయ వ్యాఖ్యానించింది. ఎంత‌యినా త‌న ఫ్రెండ్ క‌దా! అందుకే షాన‌య అలా సుహానా దుస్తుల్ని కొట్టేసింద‌న్న‌మాట‌.

అంతకుముందు షానయ తల్లి మహీప్ కపూర్.. ఫారెల్ విలియమ్స్ .. కామిలా కాబెల్లో కి చెందిన ``సాంగ్రియా వైన్`` కు స్టార్-ఇన్-మేకింగ్ గ్రోవింగ్ లో షాన‌య డ్యాన్సుల‌ వీడియోను పంచుకున్నారు. బ్లాక్ అథ్లెటిక్ డ్రెస్ ధరించిన‌ షానయ డ్యాన్సులు చేసింది. ఆ పాత వీడియోకి మించి లేటెస్ట్ బెల్లీ డ్యాన్స్ వీడియో వైర‌ల్ గా మారింది.