Begin typing your search above and press return to search.

వీడియో: ఆనంద్.. కాంపిటీష‌న్ లో ఇది చాల‌దు!

By:  Tupaki Desk   |   21 March 2021 9:10 AM GMT
వీడియో: ఆనంద్.. కాంపిటీష‌న్ లో ఇది చాల‌దు!
X
చాలా మంది హీరోలు డ్యాన్సులు నేర్చుకుని ఇండ‌స్ట్రీకి వ‌స్తున్నారు. కొంద‌రు మాత్ర‌మే ఇంకా పూర్తిగా శిక్ష‌ణ లేకుండా బ‌రిలో దిగుతుంటారు. కానీ ఇక్క‌డ తీవ్ర‌మైన పోటీ ఉంది. ఇండ‌స్ట్రీలో ఎంద‌రో డ్యాన్సింగ్ ట్యాలెంట్ తో అద‌ర‌గొడుతున్నారు. అలాంటి చోట డ్యాన్సుల ప‌రంగా సత్తా చాట‌క‌పోతే రేసులో నిల‌దొక్కుకోవ‌డం చాలా క‌ష్టం.

ఇక న‌వ‌త‌రం హీరో ఆనంద్ దేవ‌ర‌కొండ డ్యాన్సింగ్ నైపుణ్యాల‌పై తాజా వీడియో చూడ‌గానే డిబేట్ స్టార్ట‌య్యింది. ఆనంద్ త‌న శ‌క్తిమేరా డ్యాన్సుల‌తో మెప్పించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. కొరియోగ్రాఫ‌ర్ తో క‌లిసి అడుగులో అడుగు వేస్తూ బాగానే డ్యాన్స్ చేస్తున్నా ఇంకా గ్రేస్ కావాల‌న్న‌ది అభిమానుల మాట‌.

ఆనంద్ న‌ట‌న ప‌రంగా ఇప్పుడిప్పుడే మెరుగ‌వుతున్నా.. ఇంకా డ్యాన్సుల ప‌రంగా చాలా శ్ర‌మించాల్సి ఉంద‌‌న్న టాక్ ఉంది. తొలి చిత్రం దొరసారి ఫ్లాపైనా.. మ‌లి చిత్రం మిడిల్ క్లాస్ మెలోడీస్ లో న‌ట‌న ప‌రంగా బెట‌ర్ అనిపించాడు. కెరీర్ ఆరంభం అణ‌చివేత‌కు గుర‌య్యే కుర్రాడి పాత్ర‌ల్లో క‌నిపించిన అత‌డు త‌న శ‌రీర భాష‌కు త‌గ్గ పాత్ర‌ల్నే ఎంచుకున్నాడు.

ప్ర‌స్తుతం `పుష్ప‌క విమానం` చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా నుండి సిలకా పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. రామ్ మిరియాలా ర‌చ‌న‌తో పాటు స్వ‌యంగా స్వరపరిచి ఆల‌పించారు. సిలకా సంగీత ప్రియులలో ఆదరణ పొందుతోంది. ఈ చిత్రానికి డెబ్యూ దామోదర దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంద్ సోద‌రుడు హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌మ‌ర్పిస్తున్నారు. ఇందులో గీత్ సైని - సాన్వే మేఘన నాయిక‌లు. దేవరకొండ బ్ర‌ద‌ర్స్ తండ్రి గోవర్ధన రావు దేవేరకొండ- విజయ్ మట్టపల్లి- ప్రదీప్ ఎర్రబెల్లీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.