Begin typing your search above and press return to search.

వీడియో: ఏజెంట్ భీక‌ర భ‌యాన‌క అవతారం

By:  Tupaki Desk   |   30 April 2022 5:31 AM GMT
వీడియో: ఏజెంట్ భీక‌ర భ‌యాన‌క అవతారం
X
అత‌డిని చూస్తే భీభ‌త్సం భ‌యాన‌కం అని వ‌ర్ణించ‌కుండా ఉండలేం. అంత‌గా అత‌డి రూపం మారింది. బీస్ట్ లా మాన్ స్ట‌ర్ లా మారాడు. క‌సితో ర‌గిలిపోతున్న మునీశ్వ‌రుడిలా క‌నిపిస్తున్నాడు. ఈసారి కొట్టాలి అన్న పంతం అత‌డిలో స్ప‌ష్ఠంగా కనిపిస్తోంది. ఇంత‌కీ అత‌డు ఎవ‌రో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అక్కినేని చియాన్ అఖిల్ గురించే ఇదంతా.

కెరీర్ ఆరంభం నుంచి జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా అత‌డు ఎంతో క‌సిగా ప‌ని చేస్తున్నాడు. సినిమా కోసం స‌ర్వ‌స్వం అంటూ హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాడు. ప్ర‌తిసారీ తెర‌పై అది ప్ర‌తిఫ‌లిస్తోంది. సినిమా సినిమాకి ప‌రిణ‌తి చెందుతూ ముందుకు సాగుతున్నాడు.

హిట్టు వ‌చ్చినా రాక‌పోయినా దాంతో సంబంధం లేదు. తాను ఎంత క‌సిగా ప‌ని చేస్తున్నాను .. ఎంత నిజాయితీతో ప‌ని చేస్తున్నాను! అన్న‌ది మాత్ర‌మే అత‌డు చూస్తున్నాడు. అందుకే ఇప్పుడు అత‌డు అంద‌రి గుండెల్లో బాహుబ‌లుడిగా మారిపోతున్నాడు.

ఏజెంట్ మూవీ కోసం అఖిల్ శ్ర‌మిస్తున్న తీరు చూస్తుంటే యాక్ష‌న్ హీరోయిజం లో మ‌రో రేంజును చూపించే పంతం అత‌డిలో క‌నిపిస్తోంది. మాన్ స్ట‌ర్ కా బాప్ .. వ‌చ్చి మీద ప‌డితే అంతేగా.. అనే తీరుగా ఉంది అత‌డి వ్య‌వ‌హారం.

అస‌లు త‌గ్గేదేలే! అంటూ దుందుడుకు చూపించే త‌త్వం క‌నిపిస్తోంది. ఏది ఏమైనా సురేంద‌ర్ రెడ్డితో అఖిల్ కాంబినేష‌న్ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ కి తావిచ్చింది. సాహ‌సాలు థ్రిల్స్ తో సాగే స్పై కాన్సెప్ట్ కావ‌డంతో ఏజెంట్ రాక కోసం ఇండ‌స్ట్రీతో పాటు అభిమానులు ప్ర‌జ‌లు అంతా ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.

ఏజెంట్ భ‌ల్లూక ప‌ట్టు ఎలా ఉంటుందో కాస్త ఆగితే కానీ తెలీదు. ప్ర‌స్తుతానికి జిమ్ లో మెట‌ల్ మెషిన‌రీని విరిచేస్తూ ఇలా క‌నిపించాడు. ఫ్యాన్స్ లోకి జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది ఈ వీడియో. బార్న్ వేట‌లా సాగే ఏజెంట్ కోసం మీడియా అభిమానులు అంతే ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. అఖిల్-సూరి కాంబో ఇంత‌కీ తెర‌పై ఏం చూపిస్తారో కాస్త వేచి చూడాలి.