Begin typing your search above and press return to search.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో విక్టరీ వెంకీ..!

By:  Tupaki Desk   |   17 March 2021 7:41 PM IST
డిఫరెంట్ కాన్సెప్ట్ తో విక్టరీ వెంకీ..!
X
2019లో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కథానాయకులుగా.. మిల్కీబ్యూటీ తమన్నా, మెహరీన్ కథానాయికలుగా తెరకెక్కిన ఫుల్ లెన్త్ కామెడీ మూవీ 'ఎఫ్2'. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటూ సంక్రాంతి బరిలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే గాక మంచి వసూళ్లను కూడా రాబట్టింది. ఇప్పుడు ఎఫ్2 సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎఫ్3 పేరుతో శరవేగంగా రూపొందిస్తున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది ఆగష్టులో విడుదల కాబోతున్నట్లు ప్రకటించేసారు మేకర్స్. ఇప్పటికే సగం షూటింగ్ కంప్లీట్ అయిందని టాక్. ఇదిలా ఉండగా.. ఈ సినిమా గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

అదేంటంటే.. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ రేచీకటి కలిగిన పాత్రలో నటిస్తున్నాడట. ఈసారి వెంకటేష్ క్యారెక్టర్ చాలా కొత్తగా వెరైటీగా డిజైన్ చేసాడట డైరెక్టర్ అనిల్. ఆల్రెడీ ఎఫ్2తో వెంకీ కామెడీ టైమింగ్ వాడుకున్నాడు. ఇప్పుడు అదే వెంకీ టైమింగ్ తో రేచీకటి అనే కొత్త పాయింట్ యాడ్ చేసాడట. రేచీకటికి సంబంధించిన షూట్ ఇదివరకు కంప్లీట్ చేశారట. ప్రస్తుతం వెంకీ ఓవైపు నారప్ప సినిమా చేస్తూనే మరోవైపు ఎఫ్3 సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. తమిళ అసురన్ సినిమాను నారప్ప పేరుతో రీమేక్ చేస్తున్నాడు వెంకీ. ధనుష్ హీరోగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ షేక్ చేసింది. ఇప్పుడు అదే సినిమాను వెంకీ హీరోగా రీమేక్ చేస్తున్నాడు నిర్మాత సురేష్ బాబు. ఈ సినిమా మే 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు.