Begin typing your search above and press return to search.

కూతురి కోసం స్పెయిన్ వెళుతున్న విక్ట‌రీ వెంక‌టేష్‌?

By:  Tupaki Desk   |   24 July 2021 4:45 AM GMT
కూతురి కోసం స్పెయిన్ వెళుతున్న విక్ట‌రీ వెంక‌టేష్‌?
X
విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన నార‌ప్ప ఇటీవ‌లే ఓటీటీలో రిలీజై విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా వెంకీ న‌ట‌న‌కు మెగాస్టార్ చిరంజీవి స‌హా ఇండస్ట్రీ ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపించారు. అలాగే వెంకీ కుమార్తె ఆశ్రిత ఇంత‌కుముందు ఎంతో ఎమోష‌న‌ల్ గా త‌న తండ్రి పెర్ఫామెన్స్ గురించి సినిమాలో కంటెంట్ గురించి స్పందించారు. నార‌ప్ప గా వెంకీ కొత్త అవతారానికి ప్రశంసల జ‌ల్లు కురిపించారు.

ఇక వెంకీ త‌దుప‌రి చిత్రం ఎఫ్ 3 పై దృష్టి సారిస్తార‌ని అంతా భావిస్తే ఆయ‌న ఊహించ‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలిసింది. నిజానికి వెంకీ ప్ర‌తియేటా వేస‌వి సెల‌వుల‌కు యూర‌ఫ్ వెళ్లి వ‌స్తుంటారు. అక్క‌డ క‌నీసం నెల‌రోజులు టైమ్ స్పెండ్ చేస్తారు. కానీ గ‌త రెండు సీజ‌న్లుగా క‌రోనా మ‌హ‌మ్మారీ క‌ల్లోలం వల్ల వెల్ల‌లేక‌పోయారు. దీంతో అత‌డు ఎఫ్ 3కి రెండు నెల‌ల పాటు బ్రేక్ ఇచ్చి యూర‌ప్ ట్రిప్ వెళ్లాల‌ని ప్లాన్ చేసిన‌ట్టు క‌థ‌నాలొస్తున్నాయి. ప్ర‌స్తుతం ఎఫ్ 3 చిత్రీక‌ర‌ణ‌ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో జరుగుతోంది.

ఇప్పుడు వెంకీ స‌డెన్ డెసిష‌న్ తో షెడ్యూళ్ల ప్లానింగ్ మారుతోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ గ్యాప్ ని ఎలాగైనా భర్తీ చేయాలంటే ఏం చేయాలో నిర్మాత‌ దిల్ రాజు ఆల్ట‌ర్నేట్ ఆలోచిస్తున్నార‌ట‌. మ‌రోవైపు సెలవుల‌ను వాయిదా వేయమని వెంకటేష్ ను ఒప్పించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నార‌ని కూడా తెలుస్తోంది.

అయినా ఒప్పించ‌డం క‌ష్ట‌మే..

దిల్ రాజు ఎంత ట్రై చేసినా ఇప్పుడు వెంకీని ఒప్పించ‌డం క‌ష్ట‌మే. ఎందుకంటే అత‌డు బార్సిలోనా (స్పెయిన్-యూర‌ప్)లో ఉన్న త‌న కుమార్తెను అల్లుడిని చూసేందుకు వెళుతున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. వెంకీ కుమార్తె ఆశ్రిత ద‌గ్గుబాటి .. వినాయ‌క్ రెడ్డిని పెళ్లాడాక స్పెయిన్ లో సెటిల‌య్యారు. అనంత‌రం యూరప్ వెకేష‌న్ కి సంబంధించిన ఫోటోల‌ను కూడా ఆశ్రిత దగ్గుబాటి సోషల్ మీడియా వేదిక‌గా షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి. ప్రస్తుతం ఆమె భర్త వినాయక్ రెడ్డితో కలిసి బార్సిలోనాలో నివసిస్తున్నారు. స్పెయిన్ కి వెళ్లడానికి ముందే ఈ జంట 2019 లో హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నారు. అక్కడ వినాయక్ ఉద్యోగం చేస్తున్నారు.

ఇక వెంకీ కుమార్తె లో ఇన్ ఫినిటీ ప్లేట‌ర్ పేరుతో బేకింగ్ ఫుడ్ బిజినెస్ లో పాపుల‌రైన సంగ‌తి తెలిసిందే. త‌ను ట్రావెల్ ఔత్సాహికురాలు కూడా. గత కొన్ని నెలలుగా యూరప్ ని సందర్శిస్తూ అన్ని ప్రదేశాల గురించి ఇన్ స్టాగ్రామ్ లో పలు ఫోటోల‌ను పోస్ట్ చేసారు. తన స్వంత యూట్యూబ్ ఛానెల్ - ఇన్ఫినిటీ ప్లాటర్ ను ప్రారంభించి అందులో ఆమె ఆహారం,.. అన్యదేశ ప్రదేశాలు ..ఇతర విషయాలతో పాటు తన అనుభవాలను డాక్యుమెంట్ చేస్తున్నారు.

ఫ్యామిలీ లైఫ్ ప్ర‌యివేటుగానే..!

వెంకటేష్ తన కుటుంబ జీవితాన్ని ఎప్పుడూ చాలా ప్రైవేటుగా ఉంచేందుకు ఇష్ట‌ప‌డతారు. తన పిల్లలను ప‌బ్లిసిటీ గ్లేర్ లేకుండానే పెంచిన సంగ‌తి తెలిసిన‌దే. చాలా అరుదుగా మాత్ర‌మే ఆడియో ప్రీరిలీజ్ వేడుక‌లు మిన‌హా ఎప్పుడూ వెంకీ ఫ్యామిలీ ప‌బ్లిక్ వేదిక‌ల వ‌ద్ద క‌నిపించ‌నూలేదు.