Begin typing your search above and press return to search.

వెంకీ మామ 75ని ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   13 Dec 2022 4:30 PM GMT
వెంకీ మామ 75ని ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారా?
X
యంగ్ హీరోల నుంచి సీనియ‌ర్ హీరోల వ‌ర‌కు కెరీర్ మైల్ స్టోన్ మూవీస్ పై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టారు. ఇప్ప‌టికే కింగ్ నాగార్జున త‌న 100వ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించ‌డానికి ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసుకుంటున్న నేప‌థ్యంలో మ‌రో సీనియ‌ర్ హీరో వెంకీ మామ విక్ట‌రీ వెంక‌టేష్ త‌న 75 సినిమాకు రెడీ అయిపోతున్నారు. మంగ‌ళ‌వారం డిసెంబ‌ర్ 13 వెంక‌టేష్ పుట్టిన రోజు వేడుక‌లు జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే. పుట్టిన రోజు సంద‌ర్భంగా వెంక‌టేష్ 75వ ప్రాజెక్ట్ ని ఫైన‌ల్ చేసిన‌ట్టుగా తెలిసింది.

ప్ర‌స్తుతం బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ తో క‌లిసి `కిసీకీ భాయ్ కిసీకీ జాన్‌` మూవీలో న‌టిస్తున్న వెంక‌టేష్ ఇప్ప‌టికె నెట్ ఫ్లిక్స్ కోసం రానాతో క‌లిసి `రానా నాయ‌డు` వెబ్ సిరీస్ లోనూ న‌టించిన విష‌యం తెలిసిందే. షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలో తెలుగులో మ‌రో సినిమాని అంగీక‌రించ‌ని వెంక‌టేష్ తాజాగా త‌న 75వ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టుగా తెలిసింది.

ప్ర‌స్తుతం సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ వెళుతున్న వెంక‌టేష్ తాజాగా త‌న 75వ మూవీని `హిట్‌` సిరీస్ ల ఫేమ్ శైలేష్ కొల‌నుతో చేయ‌డానికి రెడీ అవుతున్నారు. రీసెంట్ గా `హిట్ 2` తో సూప‌ర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న శైలేష్ కొల‌ను హీరో విక్ట‌రీ వెంక‌టేష్ తో స్టైలిష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నార‌ట‌. వెంకీ కెరీర్ లోనే అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ మూవీ వుంటుంద‌ని, రీసెంట్ గా క‌థ విన్న వెంక‌టేష్‌, సురేష్ బాబు వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌.

రీసెంట్ గా నేచుర‌ల్ స్టార్ నానితో `శ్యామ్ సింగ‌రాయ్‌` మూవీని నిర్మించిన నిహారిక ఎంట‌ర్ టైన్ మెంట్స్ అధినేత వెంక‌ట్ బోయినప‌ల్లి ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో భారీ బ‌డ్జెట్ తో నిర్మించ‌బోతున్నార‌ని తెలిసింది. స్టైలిష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొంద‌నున్న ఈ మూవీని క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ `విక్ర‌మ్‌` స్టైల్లో సాగుతుంద‌ని, వెంక‌టేష్ పై చిత్రీక‌రించే హై వోల్టేజ్ యాక్ష‌న్ సీక్వెన్స్ లు ఈ మూవీకి ప్ర‌ధాన హైలైట్ గా నిలుస్తాయ‌ని తెలుస్తోంది.

ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ త్వ‌ర‌లో ప్రారంభిం కానున్న ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని తెలిసింది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా బావిస్తున్న ఈ మూవీని వ‌చ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నార‌ట‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.