Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ కి ఝ‌ల‌కిచ్చిన కుర్ర‌హీరో

By:  Tupaki Desk   |   8 July 2021 1:30 AM GMT
స్టార్ హీరోయిన్ కి ఝ‌ల‌కిచ్చిన కుర్ర‌హీరో
X
బాలీవుడ్ జంట విక్కీ కౌశ‌ల్-క‌త్రినా కైఫ్ మ‌ధ్య ప్రేమాయ‌ణం గురించి తెలిసిందే. ఆ ఇద్ద‌రూ త‌మ బంధంపై ఏనాడూ మాట విప్ప‌క‌పోయినా చెట్టాప‌ట్టాల్ అంటూ తిరిగేయ‌డం చాలాసార్లు మీడియా కంట ప‌డింది. అంతా అన‌ధికారికం. కానీ అధికారికంగా ఆ విష‌యాన్ని మాత్రం చెప్ప‌రు. ఈ జంట సీరియ‌స్ గా డేటింగ్ లో ఉన్నారంటూ కొలీగ్స్ లో గుస‌గుస‌లు వినిపిస్తూనే ఉంటాయి.

తాజాగా ఓ అవార్డు ఫంక్ష‌న్ లో అలాంటి స‌న్నివేశ‌మే చోటు చేసుకుంది. అనీల్ క‌పూర్ కుమారుడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ క‌పూర్ నోరు జార‌డంతో వారి డేటింగ్ విష‌యంపై మ‌రోసారి క్లారిటీ దొరికిన‌ట్లు అయింది.

సూర్య వంశీ ప్ర‌మోష‌న్ లో బిజీగా ఉన్న క‌త్రినాను ద‌ర్శ‌క‌ నిర్మాత క‌రణ్ జోహ‌ర్- అక్ష‌య్ కుమార్ ఓ రేంజ్ లో ఆట ప‌ట్టించారు. క‌త్రినా ఇంట్లో ఏదో జ‌రుగుతోంది అంటూ ఆట‌ప‌ట్టించారు. అదే అర్ధం వ‌చ్చేలా అక్ష‌య్ కుమార్ కూడా కామెంట్ చేసారు. ఇక అవార్డు ఫంక్ష‌న్ లోవిక్కీ కౌశ‌ల్ నేరుగా ఓపెన్ అయిపోయారు. వేదిక‌పై విక్కీ కౌశ‌ల్ హోస్ట్ గా ఉండ‌గా..అదే సంద‌ర్భంలో అవార్డు అందించ‌డానికి వ‌చ్చిన ముందు వ‌రుస‌లో క‌త్రినా మాజీ ప్రియుడు స‌ల్మాన్ ఖాన్ కూర్చున్నారు.

విక్కీ కౌశ‌ల్ ఏమ‌నుకున్నాడో ఏమో గానీ...నేరుగా అత‌ను విక్కీ కౌశ‌ల్ లాంటి కుర్రాడ్ని చూసి పెళ్లి చేసుకోవ‌చ్చుగా అంటూ క‌త్రిన‌ను ప్ర‌శ్నించాడు. దీంతో కత్రినా కాస్త ఆశ్చ‌ర్యానికి గురైనా ఆ త‌ర్వాత‌ ప‌క‌ప‌కా న‌వ్వుకుంది. ఇక స‌ల్మాన్ ఖాన్ అయితే న‌వ్వుల్లో మునిగితేలారు. ఆ సంద‌ర్భంలో ప‌క్క‌నే స‌ల్మాన్ చెల్లులు అర్పిత‌ కూడా కూర్చున్నారు. ఆమె భుజాలాపై వాలిపోయి మ‌రీ స‌ల్మాన్ న‌వ్వేయ‌డం హైలైట్ అయ్యింది.