Begin typing your search above and press return to search.
సింహాసనం కోసం కొట్టుకు చచ్చే బ్రదర్స్ కథ
By: Tupaki Desk | 4 March 2020 10:48 AM ISTఒకరు యుద్ధ వీరుడిగా రణభూమిపై పోరాడిన హీరో. మరొకరు వీర సైనికుడిగా ప్రత్యర్థులను మట్టుపెట్టించిన హిస్టారికల్ హీరో. ఆ ఇద్దరూ ఎదురెదురు పడితే ఇంకేమైనా ఉందా? యుద్ధభూమి మరుభూమిగా మారదూ? ఆ ఇద్దరూ పోరాట యోధులుగానే తెరపై కనిపిస్తారు. ప్రత్యర్థులతో విరోచితంగా పోరాడి గెలుస్తారు. కానీ ఇంతలోనే ఒక ట్విస్టు. ఆ ఇద్దరూ ఒకరికొకరు శత్రువులు గా మారి కొట్టుకు చస్తారు. అందులో ఒకరు రాజు అయితే మరొకరు సైనికుడు. మరి ఇలాంటి వారియర్ బ్రదర్స్ ని ఒకే ఫ్రేమ్ లో పోరాట వీరులు గా చూస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.
నిజంగానే విజువల్ గ్రాండియర్ నెస్ వస్తుంది. ప్రేక్షకులకు కనువిందుగా ఉంటుంది. ఇదంతా బాహుబలి చిత్రంలో చూశాం. ఇద్దరు వీరాధి వీరులు నేరుగా తలపడితే మహా యుద్ధమే. మరోసారి అలాంటి కథతోనే బాలీవుడ్ లో సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈసారి కాస్తా బాలీవుడ్ హీరోలు నటిస్తున్నారు. అక్కడ కథనం వేరే ఉంటుంది అంతే. ఆ యుద్ధ వీరులు ఎవరో కాదు బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్స్ రణ్‌వీర్ సింగ్.. విక్కీ కౌశల్. బాజీరావు మస్తానీ- పద్మావత్ చిత్రాలతో రణ్ వీర్ అదరగొడితే.... ఉరిః ది సర్జికల్ స్ట్రైక్స్ -రాజీ చిత్రాలతో విక్కీ కౌశల్ తనేంటో నిరూపించుకుని ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుని సాధించారు. ఇప్పుడు ఈ స్టార్లు ఇద్దరూ కలిసి నటించబోతున్నారు. అందుకు పీరియాడికల్ డ్రామా తఖ్త్ వేదిక కాబోతుంది. ఇందులో వారియర్ బ్రదర్స్ గా ఆ ఇద్దరూ కనిపించబోతున్నారు. సింహాసనం కోసం కొట్టుకునే అన్నదమ్ములు గా ఈ ఇద్దరు నటించబోతున్నారు.
బాలీవుడ్ అగ్ర దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఇందులో రణ్‌వీర్ సింగ్- విక్కీ కౌశల్ తోపాటు అలియాభట్- కరీనా కపూర్- జాన్వీ కపూర్- అనిల్ కపూర్- భూమి పడ్నేకర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని త్వరలో పట్టాలెక్కించబోతున్నారు. ఫస్ట్ టైమ్ విక్కీ ఇంతటి భారీ తారాగణంతో నటిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. విక్కీ కౌశల్ మాట్లాడుతూ, ``చాలా రోజులు గా పీరియడ్ డ్రామా చేయాలనుకుంటున్నా. ఇప్పటికీ ఆ ఛాన్స్ దక్కింది. కచ్చితంగా నా కెరీర్ లో ఇదొక గొప్ప సినిమా అవుతుంది. ఇందులో గొప్ప తారగణం నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడం ఎగ్జైటింగ్ గా ఉంది. ఇది పూర్తిగా భిన్నమైన సెటప్. ఇందులో ఒకరి ఎనర్జీ ఏంటో ఎవరికి తెలియదు. వాళ్ళ కొత్త ఎనర్జీని తెలుసుకునేందుకు ఇది మంచి ఛాన్స్ గా భావిస్తున్నా. రణ్ వీర్ అంటే నాకు చాలా ఇష్టం. మేమిద్దరం ఎప్పుడు కలిసినా ఒకరి ఒళ్లో మరొకరం కూర్చుంటాం. కానీ ఈ చిత్రం లో వారియర్ బ్రదర్స్ గా నటించడం కాస్త టిఫికల్ గా అనిపిస్తుంది` అని తెలిపారు. ప్రస్తుతం రణ్‌వీర్ 83లో నటిస్తున్నారు. అలాగే జయేష్‌భాయ్ జోర్దార్-సూర్యవంశీ లో అతిథి పాత్ర లో మెరవనున్నారు. విక్కీ సర్దార్ ఉద్దమ్ సింగ్ చిత్రంలో నటిస్తున్నారు.