Begin typing your search above and press return to search.

విక్కీ కౌశల్-కత్రినా రియాల్టీ షో

By:  Tupaki Desk   |   20 Feb 2022 12:30 AM GMT
విక్కీ కౌశల్-కత్రినా రియాల్టీ షో
X
బాలీవుడ్ హాట్ క‌పుల్ `విక్కీ - క‌త్రిన` ఇటీవ‌లే పెళ్లిబంధంతో ఒక‌టైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం హ‌నీమూన్ సెల‌బ్రేష‌న్స్ అనంత‌రం తిరిగి ఈ జంట సినిమాల‌తో బిజీ అయిన సంగ‌తి తెలిసిందే.

ఇంత‌లోనే ఈ జంట ఓ హాట్ రియాలిటీ షోతో వేడెక్కించ‌నుంద‌ని తెలిసింది. త్వరలో ప్రారంభం కానున్న `స్మార్ట్ జోడీ` షోలో భాగం కావడానికి విక్కీ- కత్రినాలను సంప్రదించారని తెలుస్తోంది.

రియాలిటీ షోలో పాల్గొంటున్నందున‌ ఈ జంటకు పెద్ద ప్యాకేజీని అందిస్తున్నార‌ని తెలిసింది. విక్కీ ఇప్పటికే తన ఆమోదం తెలిపాడు.

అయితే ఒక సోర్స్ అందించిన క‌థ‌నాల ప్ర‌కారం.. కత్రినా ఇంకా అనుమతి ఇవ్వలేదు. నిజానికి క‌త్రినకు మునుముందు భారీ క‌మిట్ మెంట్లు ఉన్నాయి.

వాటికి సంబంధించిన షెడ్యూళ్ల‌ను అనుస‌రించి రియాలిటీ షోకు సంత‌కం చేయాల్సి ఉంటుంది. అలాగే 2022లో సూప‌ర్ గాళ్ త‌ర‌హాలో లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌తో మెస్మ‌రైజ్ చేసేందుకు క‌త్రిన ప్లాన్ చేస్తోంది.  

కత్రినా కైఫ్ టైగర్ 3 .. మెర్రీ క్రిస్మస్ చిత్రాల్లో నటిస్తుంది. సూప‌ర్ ఉమెన్ కాన్సెప్ట్ లో నూ న‌టించ‌నుంది. విక్కీ కౌశల్ సామ్ బహదూర్... గోవిందా మేరా నామ్ .. లక్ష్మణ్ ఉటేకర్ మూవీ సహా ప‌లు చిత్రాలలో కనిపిస్తాడు.