Begin typing your search above and press return to search.

క‌త్రిన పెళ్లాడిన విక్కీ బ్యాక్ గ్రౌండ్ ఇదీ..!

By:  Tupaki Desk   |   5 Feb 2022 4:30 AM GMT
క‌త్రిన పెళ్లాడిన విక్కీ బ్యాక్ గ్రౌండ్ ఇదీ..!
X
స్టార్ హీరోయిన్ క‌త్రిన కైఫ్ ని పెళ్లాడాడు విక్కీ కౌశ‌ల్. కుర్ర‌హీరో లైఫ్ లో సెటిల‌య్యాడు. క‌త్రినను పెళ్లాడినందుకు ఎంతో ఎగ్జ‌యిటింగ్ గానూ ఫీల‌య్యాడు. అదంతా స‌రే.. విక్కీ కౌశ‌ల్ బాలీవుడ్ లోనే మోస్ట్ ప్రామిస్సింగ్ హీరోగా ఎదిగిన వైనం సాటి హీరోల‌కు స్ఫూర్తి అని చెప్పాలి. యూరి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రంలో విక్కీ కౌశ‌ల్ న‌ట‌న‌కు గొప్ప పేరు గుర్తింపు ద‌క్కింది. ప్ర‌స్తుతం క‌త్రిన‌తో క‌లిసి అత‌డు న‌టిస్తున్నాడు. వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు.

అదంతా అటుంచితే.. విక్కీ కౌశ‌ల్ బ్యాక్ గ్రౌండ్ ఏమిటీ? అన్న‌ది ప‌రిశీలిస్తే.. అత‌డి తండ్రి గారు బాలీవుడ్ లో ప్ర‌ముఖ స్టంట్ మాస్ట‌ర్. షామ్ కౌశ‌ల్ మాస్ట‌ర్ అంటే బోలెడంత పాపులారిటీ ఉంది. ప్ర‌స్తుతం అత‌డు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రానికి యాక్ష‌న్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. తాజాగా తాను ప‌ని చేస్తున్న తెలుగు చిత్రం అప్ డేట్ ని షామ్ వెల్ల‌డించారు. ఈ చిత్రానికి సంబంధించి క్రిష్ తో చర్చలు జరుపుతున్న ఓ ఫోటోని కూడా షామ్ పంచుకున్నాడు. ఫోటోతో పాటు అతను షెడ్యూల్ వివ‌రం వెల్ల‌డించారు. పవన్ కళ్యాణ్ సర్ తో హరి హర వీర మల్లు తదుపరి యాక్షన్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నామ‌ని తెలిపారు. తెలివైన దర్శకుడు.. చాలా మంచి వాడు.. ద‌ర్శ‌కుడు క్రిష్‌ తో చర్చలు సాగిస్తున్నాను. మిస్టర్ ఏఎం రత్నం ఈ చిత్రానికి నిర్మాత. దేవుడు మా సినిమాని టీమ్ ని ఆశీర్వదిస్తాడు.. అని షామ్ వ్యాఖ్యానించారు.

కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న యాక్షన్ షెడ్యూల్ కోసం టీమ్ సిద్ధ‌మ‌వుతోంద‌ని దీనిని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ తండ్రిగా షామ్ కౌశల్ కి గొప్ప ఇమేజ్ ఏర్ప‌డింది. విక్కీ కౌశ‌ల్ తండ్రి గారు అనేంత‌గా షామ్ కి గుర్తింపును తెచ్చాడు. పుత్రోత్సాహంతో ఆ ఆనంద క్ష‌ణాల్ని ఆయ‌న అనుభ‌విస్తున్నారు.